Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్య బాబోయ్.. అమిత్ షా ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వలేదంటే నమ్మరే : వీర్రాజు

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అవినీతి ఆరోపణలు చేసినందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఫోన్ చేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు మీడియాలో వచ్చిన వార్తలపై బీజేపీ ఎమ్మెల్సీ సోము

Webdunia
శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (15:50 IST)
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అవినీతి ఆరోపణలు చేసినందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఫోన్ చేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు మీడియాలో వచ్చిన వార్తలపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పందించారు. అమ్మతోడుగా, తమ పార్టీ అధినేత అమిత్ షా ఫోన్ చేసి హెచ్చరించలేదని స్పష్టంచేశారు. 
 
ఇదే అంశంపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, షా తనను మందలించారని వస్తున్న వార్తల్లో రవ్వంత కూడా వాస్తవం లేదన్నారు. కావాలంటే తన కాల్‌డేటా చెక్ చేసుకోవచ్చన్నారు. తన గొంతును నొక్కే ప్రయత్నం జరుగుతోందన్నారు. తనను వైసీపీ కోవర్టు అంటూ చేస్తున్న ఆరోపణలు వింటుంటే నవ్వొస్తోందని చెప్పారు. 
 
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని ఏపీ హక్కుల కోసం జేఏసీని ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు చేపట్టడం మంచిదేనన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అనిశ్చిత వాతావరణం నెలకొందని దానికి చరమగీతం పాడాలని ఆయన పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments