Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆవులు గల్లంతైతే.. చేతులు నరికేస్తారా?

అవును ఆవులు గల్లంతైన పాపానికి.. 35 ఏళ్ల వ్యక్తిని చెట్టుకు కట్టేసి చేతులు నరికేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఆవులు గల్లంతైన వ్యవహారంలో ఘర్షణ కారణంగా ఈ దారుణం జరిగిందని వార్తలు వస్తున్నాయి.

Webdunia
మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (11:54 IST)
అవును ఆవులు గల్లంతైన పాపానికి.. 35 ఏళ్ల వ్యక్తిని చెట్టుకు కట్టేసి చేతులు నరికేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఆవులు గల్లంతైన వ్యవహారంలో ఘర్షణ కారణంగా ఈ దారుణం జరిగిందని వార్తలు వస్తున్నాయి. 
 
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని పిపల్‌వాలి గ్రామంలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. ఆవులు కనిపించడం లేదంటూ ప్రేమ్‌ నారాయణ్‌ సాహూ అనే వ్యక్తి సత్తూ యాదవ్‌ గోశాలకు వెళ్లి ఆరా తీశారు. ఈ విషయమై ఘర్షణ జరగడంతో యాదవ్‌, ఆయన కుటుంబ సభ్యులు సాహుపై దాడికి పాల్పడ్డారు. సాహును తీవ్రంగా కొట్టి చెట్టుకు కట్టేసి కత్తితో అతని చేతులు నరికేశారు. 
 
బాధితుడు సాయం చేయాలని అరిచినా గ్రామస్తులు ముందుకు రాలేదని పోలీసులు తెలిపారు. స్థానికులు సమాచారం అందించడంతో స్పందించిన పోలీసులు సాహూను ఆస్పత్రికి తరలించారు. బాధితుడిపై దాడికి పాల్పడిన కుటుంబంపై హత్యా యత్నం కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని, యాదవ్ భార్య, ఆ ఇంటి పని మనిషి, కుమారుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ నిర్మాత వేదరాజు టింబర్ మృతి

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

టీలు, కాఫీలకు బదులు ఈ జావ తాగరాదూ?

తర్వాతి కథనం
Show comments