Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిల్లరపోసి హోండా మోటార్ బైక్ కొన్నాడు.. బస్తాల్లో డబ్బు తెచ్చాడు...

Webdunia
ఆదివారం, 27 అక్టోబరు 2019 (14:57 IST)
పండుగ సీజన్‌లో వివిధ కంపెనీలు, గృహవస్తు ఉత్పత్తి సంస్థలు భారీగా ఆఫర్లు ప్రకటించడం ఆనవాయితీ. దీంతో పండగ సీజన్‌లో ఏదో ఒక వస్తువు కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. 
 
అలాగే, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి కూడా తనకు ఇష్టమైన మోటార్ బైకును కొనుగోలు చేయాలని భావించాడు. అయితే, ఇందులో కొత్తేమంది అనే కదా మీ సందేహం. నిజమే... మోటర్ బైకుకు అయ్యే మొత్తం డబ్బులను బస్తాల్లో తీసుకొచ్చాడు. అదీ కూడా చిల్లర రూపంలో. ఈ డబ్బులను చూసిన మోటార్ బైకు డీలర్ విస్తుబోయాడు. పైగా, ఆ నాణేలను లెక్కబెట్టేందుకు ఏకంగా మూడు గంటల సమయం పట్టింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సత్నా జిల్లాకు చెందిన రాకేశ్ కుమార్ గుప్తాకు కూడా ఓ వస్తువు కొనాలని అనిపించింది. హోండా కంపెనీకి చెందిన యాక్టివా టూ వీలర్‌ను కొనాలని భావించాడు. కానీ, బైక్‌ను కొనేందుకు బస్తాల్లో డబ్బులు తీసుకెళ్లాడు. 
 
బైక్ ఖరీదు రూ.83 వేలు. ఇందులో వింతేమీ లేదు. కానీ, రాకేశ్ మాత్రం కేవలం రూ.5, రూ.10 నాణాలను బస్తాల్లో తీసుకెళ్లి, మొత్తం రూ.83 వేలు చెల్లించడంతోనే షోరూమ్ నిర్వాహకులు అవాక్కయ్యారు. దాదాపు మూడు గంటలకు పైగా శ్రమించిన సిబ్బంది, వాటిని లెక్కగట్టారు. రాకేశ్ ఎన్నేళ్ల నుంచి వీటిని సేకరించి పెట్టుకున్నాడో తెలియదుగానీ, ఇప్పుడీ ఫోటోలు మాత్రం వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments