ఎల్‌టీసీ ఉద్యోగులకు శుభవార్త.. ఓచర్ పథకం సిద్ధం

Webdunia
బుధవారం, 11 నవంబరు 2020 (17:46 IST)
ప్రభుత్వ ఉద్యోగులకు పండగ బొనాంజా కింద ఎల్‌టీసీ నగదు ఓచర్‌ పథకాన్ని తీసుకొచ్చిన కేంద్రం తాజాగా మరో శుభవార్త చెప్పింది. ఈ పథకం కింద ఉద్యోగులు మాత్రమే కాకుండా వారి కుటుంబసభ్యులు కూడా కొనుగోళ్లు చేసుకోవచ్చని వెల్లడించింది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎక్స్‌పెండిచర్‌ ఎఫ్‌ఏక్యూలో పేర్కొంది. అంతేగాక, ఎల్‌టీసీ పథకం వినియోగించకుండా అక్టోబరు 12 తర్వాత కొనుగోలు చేసిన వస్తువులకు కూడా రియంబర్స్‌మెంట్‌ పొందవచ్చని స్పష్టం చేసింది.
 
అక్టోబరు 12న ఈ ఎల్‌టీసీ (లీవ్‌ ట్రావెల్‌ కన్సెషన్‌) నగదు ఓచర్‌ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పథకం కింద కొనుగోలు చేసే వస్తువుల బిల్లులపై ఉద్యోగుల పేరే ఉండాలా లేదా కుటుంబ సభ్యులు కూడా ఉండొచ్చా అని మంత్రిత్వశాఖను అడగ్గా.. ఉద్యోగి భాగస్వామి లేదా కుటుంబసభ్యుల పేర్ల మీద కూడా కొనుగోళ్లు చేసుకోవచ్చని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎక్స్‌పెండిచర్‌ తెలిపింది.
 
అయితే ఆ కుటుంబసభ్యుల పేర్లు తప్పకుండా ఉద్యోగి సర్వీస్‌ రికార్డుల్లో ఉండాలని సూచించింది. అంతేగాక, ఈఎంఐ రూపంలో కొనుగోలు చేసే వాటికి కూడా ఈ పథకం వర్తిస్తుందని పేర్కొంది. అక్టోబరు 12 నుంచి వచ్చే ఏడాది మార్చి-31లోపు ఎల్‌టీసీని ఉపయోగించకుండా వస్తువులు కొనుగోలు చేసినా.. వాటిపై రియంబర్స్‌మెంట్‌ పొందొచ్చని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments