దుబ్బాక గెలుపుపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. టీఆర్ఎస్‌కు పట్టున్న దుబ్బాకలో గెలవడం తమ పార్టీకి బూస్టింగ్ వంటిదని పేర్కొన్నారు. దుబ్బాకలో గెలుపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పనిచేయడానికి ఇంకా ఉత్సాహాన్ని ఇస్తుందని తెలిపారు. ఎక్కడైనా అభ్యర్థి ప్రాధాన్యతగానే ఎన్నికలు జరుగుతాయని తెలిపారు.
దుబ్బాక, బీహార్ విజయాన్ని ప్రజా విజయంగా అభివర్ణించారు. ఏపీ బీజేపీ అభ్యర్థులు సోము వీర్రాజు కుల, మతాలకు అతీతమైన విజయాన్ని ప్రజలు మోదీకి అందించారన్నారు. ఇక రాబోయే రోజుల్లో ఏపీలో ఇలాంటి విజయాలే చూస్తారన్నారు. దీంతో విజయవాడ బీజేపీ కార్యాలయం ఎదుట బాణ సంచా కాల్చి, స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకుంటున్నారు.
అటు 2024 ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలయికతో ఏపీలో అధికారంలోకి వస్తామంటున్నారు. ఉప ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన బీజేపీ దుబ్బాకలో మొదటిసారి విజయకేతనం ఎగురవేసింది. 14 వందల ఓట్లకు పైగా తేడాతో టీర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతను బీజేపీ అభ్యర్థి రఘునంధన్ రావు ఓడించారు.
మొత్తం 23 రౌండ్లలో సాగిన ఓట్ల లెక్కింపులో రఘునంధన్ రావుకు 62,772 ఓట్లు రాగా సోలిపేట సుజాతకు 61,302 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి చెరకు శ్రీనివాస్ రెడ్జికి 21,819 ఓట్లు వచ్చాయి. ఓట్ల శాతంలో బీజేపీకి 39 శాతం, టీఆర్ఎస్‌కు 37 శాతం వచ్చాయి.