Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోక్‌సభ సమరం కోసం బీజేపీ సిద్ధం... తొలి జాబితాలో చోటుదక్కని నేతలు వీరే...

ఠాగూర్
ఆదివారం, 3 మార్చి 2024 (12:15 IST)
త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ 195 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. ఇందులో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, 28 మంది మహిళలు, 47 మంది 50 ఏళ్లలోపు యువకులు, ఎస్సీ- 27, ఎస్టీ- 18, ఓబీసీ- 57 మంది అభ్యర్థులు ఈ జాబితాలో ఉన్నారు. సర్వేలు, పార్టీలో అంతర్గత సమీకరణాలు, జనాభిప్రాయం ఇలా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాక బీజేపీ అధిష్టానం తొలి విడత అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఫస్ట్ లిస్టులో పలువురు సీనియర్లకు చోటుదక్కలేదు.
 
సీటు రానివారిలో భోపాల్ నుంచి వివాదాస్పద ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ స్థానంలో అలోక్ శర్మ పేరుని బీజేపీ ప్రకటించింది. కీలక ఎంపీగా ఉన్న మీనాక్షి లేఖి స్థానంలో న్యూఢిల్లీకి చెందిన బన్సూరి స్వరాజ్‌‍ను పార్టీ పోటీ చేయిస్తోంది. ఆమె మాజీ మంత్రి, దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె. దక్షిణ ఢిల్లీ నుంచి రమేశ్ బిధూరి స్థానంలో రాంవీర్ సింగ్ బిధూరి, ఢిల్లీ చాందినీ చౌక్ నుంచి డాక్టర్ హర్ష్ వర్ధన్ స్థానంలో ప్రవీణ్ ఖండేల్వాల్ పేర్లను వెల్లడించింది. 
 
పశ్చిమ ఢిల్లీ నుంచి కమల్త్ సెహ్రావత్ ను పార్టీ బరిలోకి దింపింది. విదిశ స్థానం నుంచి రమాకాంత్ భార్గవ స్థానంలో శివరాజ్ సింగ్ చౌహాను పార్టీ పెద్దలు అవకాశం కల్పించారు. గుణ లోక్‌సభ నుంచి కృష్ణ పాల్ సింగ్ యాదవ్ స్థానంలో జ్యోతిరాదిత్య సింథియా, తిరువనంతపురం నుంచి కుమ్మనం రాజశేఖరన్ స్థానంలో రాజీవ్ చంద్రశేఖర్‌ని పార్టీ పోటీలోకి దింపింది. గౌతమ్ బుద్ధ నగర్ నియోజవర్గం నుంచి పంకజ్ సింగ్ స్థానంలో మహేశ్ శర్మను బీజేపీ ఎంపిక చేసింది. 
 
అలీపురువార్ నియోజకవర్గంలో అలీపురువార్ స్థానంలో మనోజ్ తిగ్గాకు చోటిచ్చింది. డిబ్రూఘర్ నుంచి రామేశ్వర్ తేలి స్థానంలో సర్బానంద సోనోవాల్, రత్లాం స్థానం నుంచి గుమాన్ సింగ్ దామోర్ స్థానంలో అనితా నగర్ సింగ్ చౌహాన్ పేర్లను బీజేపీ ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments