Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైదరాబాద్ లోక్‌సభ బీజేపి అభ్యర్థి మాధవీలత చేతిలో అసదుద్దీన్ ఓవైసి ఓటమి తప్పదా?

kompella madhavilatha

ఐవీఆర్

, శనివారం, 2 మార్చి 2024 (22:27 IST)
ఫోటో కర్టెసీ- ఇన్‌స్టాగ్రాం
భాజపా విడుదల చేసిన లోక్ సభ అభ్యర్థుల జాబితాలో తెలంగాణకు చెందినవారివి 9 పేర్లు ప్రకటించారు. ఐతే వీరిలో 8 మంది పురుషులు వుండగా మాధవీలత అనే మహిళ కూడా వుండారు. ఇపుడామె పేరు తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం లేకపోలేదు. ఎందుకంటే... ఇప్పటివరకూ ఆమెకి భాజపా సభ్యత్వం లేదు. రాజకీయ నేపధ్యమూ లేదు. అలాంటిది ఒక్కసారిగా ఆమెను ఏకంగా ఓవైసికి కంచుకోటగా పరిగణించే హైదరాబాద్ స్థానం నుంచి భాజపా ప్రకటించడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇంతకీ అసలు ఎవరీ మాధవీలత? అని చాలామందికి తలెత్తుతున్న ప్రశ్న.
 
డాక్టర్ మాధవీలత కోటి మహిళా కళాశాల నుంచి రాజనీతి శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేసారు. ఆమె తన జీవితాన్ని సమాజసేవకు అంకితం చేసారు. ఎందరో పేదలకు తను స్థాపించిన ట్రస్ట్ ద్వారా సేవలు చేస్తుంటారు. ఆమె భరతనాట్యం నర్తకిగా కూడా ప్రసిద్ధి చెందినవారు. లోపాముద్ర ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా హైదరాబాద్ నగరంలో ఎంతోమంది నిరుపేదలకు ఆపన్నహస్తం అందిస్తున్నారు. ఆమెకి కోట్లరూపాయల ఆస్తి వున్నప్పటికీ కాషాయపు మడిలో ఓ సాధారణ మహిళగా కనిపిస్తుంటారు. ఎలాంటి ఆర్భాటాలు వుండవు. ఆమె స్థాపించిన ఛారిటబుల్ ట్రస్ట్, ఆసుపత్రి ద్వారా ఎంతోమంది ముస్లిం మహిళలు కూడా సాయం అందుకుంటూ వుంటారు.
 
సమాజసేవే ధ్యేయంగా ఎన్నో ఏళ్లుగా సేవ చేస్తున్న మాధవీలత హైదరాబాద్ లోక్ సభ స్థానం నుంచి ఓవైసి పైన విజయం సాధించడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే మాధవీలత చరిత్ర సృష్టించినవారవుతారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ- వెడ్డింగ్.. వెయ్యి కోట్లు ఖర్చు?