Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీ తీసుకుంటుండగా పిడుగుపడి 11 మంది మృతి

Webdunia
సోమవారం, 12 జులై 2021 (10:37 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ ప్యాలెస్ టవర్ వద్ద విషాదం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు 11 మంది మత్యువాతపడ్డారు. సెల్ఫీ తీసుకుంటుండగా ఈ పిడుగు పడింది. దీంతో 11 మంది చనిపోయారు. 
 
కరోనా లాక్డౌన్ ఆంక్షలు సడలించడంతో జైపూర్‌లోని అమేర్ ప్యాలెస్ వ‌ద్ద ఉన్న వాచ్ ట‌వ‌ర్‌కు ప‌ర్యాట‌కుల తాకిడి ఎక్కువైంది. ఆదివారం రాత్రి 7 గంట‌ల స‌మ‌యంలో వాచ్ ట‌వ‌ర్ వ‌ద్ద భారీ వ‌ర్షం కురిసింది. ఈ క్ర‌మంలో ఆ ట‌వ‌ర్ వ‌ద్ద సెల్ఫీలు తీసుకునేందుకు ప‌ర్యాట‌కులు ఎగ‌బ‌డ్డారు. 
 
ఆ స‌మ‌యంలోనే భారీ పిడుగు ప‌డింది. దీంతో అక్క‌డిక‌క్క‌డే 11 మంది ప‌ర్యాట‌కులు మృతి చెంద‌గా, మ‌రో 35 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రులు ప‌క్క‌నున్న లోయ‌లో ప‌డిపోయారు. 
 
వారంద‌రినీ రెస్క్యూ టీం బ‌య‌ట‌కు తీసుకొచ్చి.. స‌మీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తీవ్ర దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments