Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియన్స్‌కు రొమాన్స్ అంటే ఏంటో తెలీదు... అందుకే డేటింగ్ చేయడం మానేశా? : లైఫ్ కోచ్

వరుణ్
బుధవారం, 24 జులై 2024 (13:12 IST)
భారతీయ పురుషులను ఉద్దేశించి ఒక స్వదేశీ మహిళ చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్‌గా మారాయి. స్వదేశీ పురుషులతో తాను డేటింగ్ చేయనని ఆమె చెప్పారు. ఎందుకంటే.. వారిలో రొమాన్స్ గుణాలు లేవని పేర్కొన్నారు. ఇపుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. విదేశీ మహిళ ఈ మాటంటే మన నెటిజన్లు పట్టించుకునివుండరు. కానీ, స్వయంగా ఓ భారతీయ మహిళ ఈ మాట అనడంతో ఈ విషయం సంచలనంగా మారింది. తమ జీవితాలను దారిలో పెట్టుకునేందుకు ఎందరికో సాయపడిన లైఫ్ కోచ్ చేతనా చక్రవర్తి కామెంట్స్‌పై పెద్ద దుమారమే రేగుతోంది. అయితే, తన నిర్ణయానికి గల కారణాలనూ ఆమె వివరంగా చెప్పుకొచ్చింది.
 
'భారతీయ పురుషులతో డేటింగ్ చేయడం మానేశా. ఇందుకు మూడు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఏ విషయంలోనైనా వారు తమ వాదనను సరిగా వినిపించలేకపోతే మూగనోము పడతారు. మహిళకు పొగరని, మొండిఘటమని ముద్రవేస్తారు. వాళ్లకు రొమాన్స్ అంటే ఏంటో తెలీదు. అవతలి వారి కోసం రోజూ చేసే చిన్న చిన్న పనుల్లోనే రొమాన్స్ దాగుంది. భారీ బహుమతులు, హంగామాతో ఉపయోగాలు ఉండవు. భారతీయ పురుషులకు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం తెలీదు. ఇంటి శుభ్రత భాగస్వామి కోసమే కాదని, అక్కడ తాము కూడా నివసిస్తున్నామన్న స్పృహ ఉండదు' అని ఆమె చెప్పుకొచ్చింది.
 
సహజంగానే ఈ వీడియోకు నెట్టింట భారీ స్పందన వచ్చింది. ఇప్పటివరకూ 79 వేల వ్యూస్, 12 వేల లైక్స్ రాగా కొందరు మహిళలు ఆమెతో విభేదించారు. తాను భారతీయుడినే పెళ్లాడానని, అతనో అద్భుతమైన వ్యక్తి అని ఓ మహిళ కామెంట్ చేసింది. కొందరితో చెడు అనుభవాలు ఎదురైనంత మాత్రాన భారతీయ పురుషులందరినీ ఒకేగాటన కట్టకూడదని కామెంట్ చేశారు. ఇది భారతీయ పురుషులకే ప్రత్యేకం కాదని, లింగవివక్షకు సంబంధించినదని కొందరు అభిప్రాయపడ్డారు. కొందరు మాత్రం మహిళ అభిప్రాయంతో ఏకీభవించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అజిత్ కుమార్ పట్టుదలకు యు/ఎ సెన్సార్

అప్సరా రాణి రాచరికం మూవీ ఎలా ఉందంటే.. రాచరికం రివ్యూ

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments