ఈసారి వ‌ర్షాలు.. సాధార‌ణం క‌న్నా త‌క్కువే!

Webdunia
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (17:20 IST)
ఈ ఏడాది వర్షాలు సాధారణం కన్నా తక్కువే ఉంటాయని స్కైమెట్ వాతావరణ సంస్థ వెల్లడించింది. ప్రతి సంవత్సరం జూన్ మాసం ప్రారంభంలో రుతుపవనాలు కేరళ రాష్ట్రంలో ప్రవేశించే విషయం తెలిసిందే. రుతుపవనాలు ఆ రాష్ట్రాన్ని తాకిన తర్వాతే దేశ‌వ్యాప్తంగా విస్తరిస్తాయి. అయితే ఈ ఏడాది సాధార‌ణ వ‌ర్షపాతం క‌న్నా త‌క్కువే వర్షాలు కురుస్తాయని స్కైమెట్ సంస్థ చెప్పింది. 
 
లాంగ్ పీరియ‌డ్ రేంజ్‌(ఎల్‌పీఏ)లో రుతుప‌వ‌నాల ప్ర‌భావం 93 శాతం ఉంటుంద‌ని ఆ సంస్థ అంచ‌నా వేసింది. వ‌ర్ష‌పాతం 90 నుంచి 95 శాతం ఉందంటే, అది బిలో నార్మ‌ల్ రేంజ్ అని ఆ సంస్థ పేర్కొంది. 1951 నుంచి 2000 సంవ‌త్స‌రం వ‌ర‌కు ఎల్‌పీఏ వ‌ర్ష‌పాతం స‌గ‌టున‌ 89 సెంటీమీట‌ర్లు ఉంది. ఎల్‌నినో ప్ర‌భావం వ‌ల్లే వ‌ర్ష‌పాతం ఈసారి సాధారణం క‌ంటే త‌క్కువ‌గా ఉంటుంద‌ని స్కైమెట్ సీఈవో జ‌తిన్ సింగ్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Atlee, Arjun: అల్లు అర్జున్ రాకా టైటిల్‌కు పుష్పతో సంబంధం ఉంది : చిత్ర నిర్మాతలు

DMK-ADMK పొత్తును తమిళ ప్రజలు ఒప్పుకోరు: విశాల్ వ్యాఖ్య, ఖుష్బూ కూడా...

Simran: దక్షిణాది నటీమణులంటే బాలీవుడ్‌ అగౌరపరుస్తుంది : సిమ్రాన్

MaheshBabu: వారణాసి సెట్ కు నీటి సమస్య తలెత్తిందా?

Peddi Openings: నార్త్ అమెరికాలో పెద్ది చిత్రం ప్రీబుకింగ్ ఫుల్

తర్వాతి కథనం
Show comments