Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉరిశిక్షలకు ప్రత్యామ్నాయం లేదా? సుప్రీంకోర్టు ప్రశ్న

Webdunia
బుధవారం, 3 మే 2023 (10:38 IST)
తీవ్ర నేరాలకు పాల్పడి ఉరిశిక్ష పడే ఖైదీలను చివరి క్షణాల్లో నొప్పి కలగకుండా అంటే ఉరి వేసి చంపకుండా ఉండేలా ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు లేవా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మరణశిక్షను ఉరి తీయడం రూపంలోనే అమలు చేయాలా అని అడిగింది. దీనికి వేరే విధానం లేదా అని ప్రశ్నించింది. దీనికి కేంద్రం తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపింది. 
 
ఉరికొయ్యకు వేలాడదీయడం కన్నా తక్కువ బాధను కలిగించే ఇంజెక్షన్లు ఇవ్వడం, షూట్ చేయడం, కరెంటు షాకు ఇవ్వడం, గ్యాస్ ఛాంబర్లలో పెట్టడం వంటి ప్రత్యామ్నాయ విధానాలు అమలు చేయాలని కోరుతూ న్యాయవాది రిషి మల్హోత్రా 2017లో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ కేసును తాజాగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ జె.బి.పార్టీవాలాల ధర్మాసనం విచారణకు చేపట్టింది. 
 
కేంద్ర ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి సమాధానం చెబుతూ దీనిపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేసే అలోచన ఉందని, ఇందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. నిపుణులను ఎంపిక చేసే పనిలో ఉన్నామన్నారు. దీంతో తదుపరి విచారణను వేసవి సెలవుల తర్వాత చేపట్టనున్నట్టు కోర్టు ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్దల మాట, పోలీస్ వారి హెచ్చరిక మన మంచికే : ట్రైలర్ లో వక్తలు

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం