Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బురదలో కూరుకునిపోయిన ప్రధాని ఎస్కార్ట్ హెలికాఫ్టర్

Advertiesment
pmescort helicopter
, మంగళవారం, 2 మే 2023 (20:18 IST)
కర్నాటక ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ నెల 10వ తేదీన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. దీంతో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ ప్రచారం కోసం రాజకీయ నేతలు హెలికాఫ్టర్లను వినియోగిస్తున్నారు. ఇలాంటి వారిలో ప్రధాని మోడీ సైతం ఉన్నారు. అయితే, ఆయన ప్రచారంలో ఓ అపశృతి చోటు చేసుకుంది. ఆయన ఎస్కార్ హెలికాఫ్టర్ బురదలో కూరుకుని పోయింది. ఆ హెలికాప్టర్ ల్యాండైన ప్రదేశం చిత్తడి ఉండడంతో ఈ పరిస్థితి ఎదురైంది. 
 
కర్నాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లా సింధనూరు వద్ద ఓ సభలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారు. హోసళ్లి క్యాంపు సమీపంలోని ఓ వరిపొలంలో హెలిప్యాడ్ ఏర్పాటుచేశారు. కానీ ఆ పొలం ఇంకా చిత్తడిగానే ఉండడంతో, ల్యాండైన హెలికాప్టర్ మళ్లీ గాల్లోకి లేవలేకపోయింది. దాంతో, ఓ జేసీబీ, 100 మంది మనుషుల సాయంతో హెలికాప్టర్‌ను బురద నుంచి బయటికి తీసుకువచ్చారు. సెక్యూరిటీ సిబ్బంది తప్పిదం వల్లే ప్రధాని మోడీ ఎస్కార్ట్ హెలికాప్టర్‌‌కు ప్రమాదం ఎదురైందని భావిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాక ఇడ్లీకి ఫిదా అయిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు