Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్ సచివాలయంలోకి చిరుత.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

Webdunia
సోమవారం, 5 నవంబరు 2018 (12:55 IST)
గుజరాత్ సచివాలయంలోకి చిరుత ప్రవేశించింది. పటిష్ట బందోబస్తు వున్నప్పటికీ సెక్యూరిటీ కళ్లుగప్పి చిరుత సచివాలయంలోకి ప్రవేశించింది. గుజరాత్, గాంధీనగర్‌‌లోని అత్యంత భారీ భద్రతను దాటుకుని లోపలికి ప్రవేశించింది. 
 
గేట్లు మధ్య ఉన్న ఖాళీ స్థలం ద్వారా ప్రవేశించడం.. ఈ చిరుత ఎంట్రీ ఇవ్వడం సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. అహ్మదాబాద్‌లో కొత్తగా నిర్మించిన సచివాలయం భవనం, ముఖ్యమంత్రి కార్యాలయం పరిసరాల్లోకి ఓ చిరుతపులి ప్రవేశించడం తీవ్ర కలకలం రేపింది. 
 
చిరుత ప్రవేశించిన విజువల్స్ చూసి అధికారులు షాకయ్యారు. వెంటనే రంగ ప్రవేశం చేసిన అధికారులు, ఉదయం నుంచి చిరుత జాడ కోసం వెతుకులాట ప్రారంభించారు. మరోవైపు ఇంద్రోదా పార్క్ నుంచి ఈ చిరుత పులి ప్రవేశించి వుండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
 
ఇక తాజా ఘటనలో అలర్టైన అధికారులు చిరుత మళ్లీ వస్తే పట్టుకునేందుకు బోనులను ఏర్పాటు చేశారు. చిరుత ఎటు వెళ్లిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం గుజరాత్ సచివాలయంలోకి చిరుత ప్రవేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments