Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆధ్యాత్మిక గురువు స్వామి కేశవానంద భారతి కన్నుమూత

Webdunia
ఆదివారం, 6 సెప్టెంబరు 2020 (12:54 IST)
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు కేశ‌వానంద భార‌తి క‌న్నుమూశారు. ఆయన వయసు 79 యేళ్లు. కేర‌ళ‌లోని ఎడ‌నీర్ మ‌ఠ్‌లో ఆదివారం తెల్లవారుజామున 3:30 నిమిషాల ప్రాంతంలో కేశ‌వానంద భార‌తి శివైక్యం చెందినట్టు పోలీసులు వెల్లడించారు. రాజ్యాంగ మౌలిక స్వ‌రూపం ఏర్పాటుకు దారితీసిన కేసులో భార‌త ప్ర‌ధాన పిటిష‌న‌ర్‌గా ఉన్నారు. 
 
కేర‌ళ భూసంస్క‌ర‌ణ చ‌ట్టంపై 1973లో కేశ‌వానంద భార‌తి సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేశారు. ఈ కేసు కేశ‌వానంద భార‌తి వ‌ర్సెస్ స్టేట్ ఆఫ్ కేర‌ళ‌గా ప్రాచూర్యం పొందింది. ఈ కేసును 13 మంది న్యాయ‌మూర్తుల‌తో కోర్టు విచార‌ణ జ‌రిపింది. రాజ్యాంగ మౌలిక స్వ‌రూపానికి సుప్రీంకోర్టు సంర‌క్ష‌ణ‌దారని తీర్పు ఇచ్చింది. 
 
సుప్రీంకోర్టు చ‌రిత్ర‌లోనే ఈ కేసు సుదీర్ఘంగా 68 రోజుల పాటు విచార‌ణ జ‌రిగింది. కేశవానంద భారతి ఆశ్రమానికి చెందిన మఠాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ ఈ కేసు దాఖలైంది. చరిత్ర గతినే మార్చివేసిన కేసుగా దీన్ని న్యాయ కోవిదులు అభివర్ణిస్తుంటారు. 
 
1973లో నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎం. సిక్రీ నేతృత్వంలో జేఎం షెలట్, కేఎస్ హెగ్డే, ఏఎన్ గ్రోవర్, బీ జగన్మోహన్ రెడ్డి, డీజీ పాలేకర్, హెచ్ ఆర్ ఖన్నా, ఏకే ముఖర్జీ, యశ్వంత్ విష్ణు చంద్రచూడ్, ఏఎన్ రాయ్, కేకే మాథ్యూ, ఎంహెచ్ బేగ్, ఎస్ ఎన్ ద్వివేదీ ఈ కేసును విచారించారు. 
 
1972 అక్టోబర్ 31 న విచారణ ప్రారంభమై 1973 మార్చి 23న ముగిసింది. ఏప్రిల్ 24న తీర్పు వెలుపడింది. 'రాజ్యాంగ మూల సూత్రాన్ని పార్లమెంట్ మార్చడానికి వీల్లేదు' అని సంచలన తీర్పు వెలువరించారు. 13 మంది న్యాయమూర్తుల్లో నలుగురు ఈ తీర్పును వ్యతిరేకించారు. తీర్పు ప్రతులపై సంతకాలు చేయలేదు. చివరికి దీనిపై విజయం సాధించి, మఠం ఆస్తులను స్వామీజీ కాపాడారు. సుప్రీం చరిత్రలోనే ఎక్కువ రోజులు విచారణ సాగింది ఈ కేసుపైనే అని అంటుంటారు.  
 
అందుకే ఇప్పటికి కూడా చాలా కేసులకు ఈ కేసే ప్రాతిపదికగా నడుస్తోంది. కేశవానంద భారతీ తరపున ప్రముఖ న్యాయవాద నానీ పాల్కీవాలా ఈ కేసు వాదించారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి ఈ కేసు విచారణకు ఏకంగా 12 మంది జడ్జీల బృందాన్ని నియమించారు. 68 రోజుల పాటూ ఈ కేసు విచారణ సాగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments