Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోళీకోడ్‌ ఘటన.. బ్యాక్ టూ హోం ఫోటో వైరల్.. ప్రమాదాన్ని ముందే పసిగట్టాడా...?

Advertiesment
కోళీకోడ్‌ ఘటన.. బ్యాక్ టూ హోం ఫోటో వైరల్.. ప్రమాదాన్ని ముందే పసిగట్టాడా...?
, శనివారం, 8 ఆగస్టు 2020 (11:33 IST)
Kozhikode plane crash
కోళీకోడ్‌ విమాన ఘటనకు సంబంధించి అనేక విషాధ ఘటనలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. అలాంటి ఘటనే ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. కోళీకోడ్‌లోని కున్నమంగళానికి చెందిన షరాపు గల్ఫ్‌లో పని చేస్తున్నారు. కరోనా సంక్షోభంతో అత్యవసరంగా భార్య అమీనా షెరిన్, కుమార్తె ఇసా ఫాతిమాతో కలిసి స్వదేశానికి స్వదేశానికి పయనమయ్యారు. 
 
ప్రోటోకాల్  ప్రకారం అన్ని రక్షణాత్మక చర్యలు తీసుకున్న ఈ యువ దంపతులు "బ్యాక్ టూ హోం'' అంటూ ఒక సెల్ఫీని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ విషయాన్ని తలచుకుని దుబాయ్‌లో ఒక హోటల్ నడుపుతున్న షరాఫు స్నేహితుడు షఫీ కన్నీటి పర్యంతమయ్యారు. ఇండియాకు వెళ్లేముందు తనను కలిసిన స్నేహితుడి జ్ఙాపకాలను సోషల్ మీడియా ద్వారా గుర్తు చేసుకున్నారు. 
 
కేరళకు బయల్దేరే ముందు.. వీడ్కోలు చెప్పేందుకు హోటల్‌కు వచ్చాడని.. కొంచెం కలతగా కనిపించాడని చెప్పాడు. ఎందుకో టెన్షన్ అనిపిస్తోందని.. ఇంకా కరోనా కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయమని, వారికి అన్న పెట్టాలంటూ  కొంత డబ్బు కూడా ఇచ్చాడు. ఇదంతా గమనిస్తోంటే.. ప్రమాదాన్ని ముందే పసిగట్టాడా...ఇదొక సూచనా అని అనిపిస్తోంది'' అని ఫేస్ బుక్ పోస్ట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. 
 
కాగా ఈ విమాన ప్రమాదంలో షరాఫు బేబీ మెమోరియల్ ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు. అతని భార్య అమీనా ఆరోగ్య పరిస్థితి  స్థిరంగా ఉండగా, కుమార్తె  ప్రస్తుతం కోళీకోడ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మొబైల్ మార్కెట్లో శాంసంగ్ అగ్రస్థానం.. షావోమీ వెనకబడిపోయిందా?