ఏంటి.. కోవిడ్ బెడ్ లేదా.. అయితే రోగిని చంపెయ్...

ఠాగూర్
శుక్రవారం, 30 మే 2025 (08:50 IST)
మహారాష్ట్రలో లాతూర్‌ ఆస్పత్రిలో గత 2021లో వచ్చిన కోవిడ్ సమయంలో జరిగిన ఓ ఆడియో ఒకటి ఇపుడు వైరల్ అవుతోంది. లాతూర్‌ ఆస్పత్రికి వచ్చిన కోవిడ్ రోగికి కోవిడ్ బెడ్ లేకపోవడంతో ఆ రోగిని చంపెయ్ అంటూ తోటి వైద్యుడుకి సర్జన్ ఒకరు సలహా ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఆడియో ఇపుడు వెలుగులోకి వచ్చింది. 
 
లాతూర్‌కు చెందిన కౌసర్ ఫాతిమా అనే మహిళ కోవిడ్  బారినపడటంతో ఆమెను భర్త దయామీ అజీమొద్దీన్ గౌసుద్దీన్ గత 2021 ఏప్రిల్ 15వ తేదీన ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ కోవిడ్ వార్డులో డాక్టర్ శశికాంత్ డాంగే విధులు నిర్వహిస్తున్నాడు. ఆ వార్డులో చేరిన ఫాతిమా.. పది రోజుల పాటు చికిత్స చేయించుకుని డిశ్చార్జ్ అయ్యారు. అయితే, ఏడో రోజున ఫాతిమా భర్త దయామీ డాక్టర్ శశికాంత్ డాంగే వద్ద ఉన్న సమయంలో ఓ ఫోను వచ్చింది. తన సీనియర్ సర్జన్ డాక్టర్ శశికాంత్ దేశ్‌పాండే నుంచి ఆ ఫోన్ వచ్చింది. ఆ సమయంలో డాక్టర్ డాంగే భోజనం చేస్తుండటంతో ఫోను స్పీకర్ ఆన్ చేసి మాట్లాడారు. దీంతో వారి మాటల్లో కొన్ని అస్పష్టంగా వినిపించాయని ఫాతిమా భర్త దయామీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా.. ఆస్పత్రిలో బెడ్లు ఏవైనా ఖాళీ ఉన్నాయా అని ప్రశ్నించారు. దీనికి డాక్టర్ డాంగే ఖాళీ లేవని చెప్పడంతో అపుడు దేశ్‌పాండే... ఎవర్నీ చేర్చుకోవద్దు. మీ పేషెంట్‌ను చంపెయ్ అన్నట్టుగా తనకు వినపిడిందని దయామీ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి డాంగే అప్పటికే ఆక్సిజన్ సపోర్టు తగ్గించినట్టు సమాధానమిచ్చారని తెలిపారు. ఇపుడు ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫిర్యాదు మేరకు ఉద్గిర్ నగర్ పోలీసులు మే 24వ తేదీన దేశ్‌పాండేపై కేసు నమోదు చేశారు. వైరల్ అవుతున్న ఆడియోలో క్లిప్‌లో ఉన్నది ఆయన స్వరమేనా అనే నిర్ధారించుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments