Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలికపై తండ్రి అత్యాచారం.. మూడు జీవిత ఖైదులను విధించిన కోర్టు

Webdunia
మంగళవారం, 31 జనవరి 2023 (11:57 IST)
మైనర్ అయిన కుమార్తెపై పదేపదే అత్యాచారానికి పాల్పడిన తండ్రికి తగిన శాస్తి జరిగింది. కుమార్తెపై అత్యాచారం ఆపై గర్భవతిని చేసిన తండ్రికి కేరళ కోర్టు మూడు జీవిత ఖైదులు విధించింది. 
 
నిందితుడికి మూడు జీవిత ఖైదులు విధించిన న్యాయస్థానం జీవితాంతం అతడు జైలులోనే ఉండాలని తీర్పు చెప్పినట్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సోమసుందరన్ తెలిపారు. అంతేకాదు, దోషికి రూ. 6.6 లక్షల జరిమానా కూడా విధించారు. 
 
వివరాల్లోకి వెళితే.. మార్చి 2021లో తొలిసారి 15 ఏళ్ల కుమార్తెపై దోషి అత్యాచారానికి పాల్పడ్డాడు. కరోనా నేపథ్యంలో బాలిక ఇంట్లో ఉండి ఆన్‌లైన్ క్లాసులకు హాజరవుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది.   ఏడాది అక్టోబరు వరకు కుమార్తెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఆ బాలిక గర్భం దాల్చింది. 
 
దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విచారణ అనంతరం బాలిక తండ్రిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బాలిక గర్భాన్ని వైద్యులు తొలగించారు. 
 
పిండం, బాలిక తండ్రి డీఎన్ఏను అధికారులు సేకరించారు. అనంతరం జరిపిన పరీక్షల్లో బాలిక గర్భవతి కావడానికి తండ్రే కారణమని తేలింది. దీంతో అతని జీవితాంతం జైలులో గడపాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

Vijay: రష్మిక మందన్న బర్త్ డే వేడుకను ఓమన్ లో జరిపిన విజయ్ దేవరకొండ !

కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం