Webdunia - Bharat's app for daily news and videos

Install App

వార్షిక బడ్జెట్ సిద్ధం... పక్కా మిడిల్ క్లాస్ బడ్జెట్ అంటూ ప్రచారం

Webdunia
మంగళవారం, 31 జనవరి 2023 (11:47 IST)
కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‍‌ను తయారు చేశారు. ఇది పక్కా మిడిల్ క్లాస్ బడ్జెట్‌గా రూపొందించినట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా సగటు వేతన జీవికి భారీ ఊరట కలిగించేలా రూపొందించినట్టు సమాచారం. మధ్యతరగతిని దృష్టిలో ఉంచుకుని ఈ బడ్జెట్‌ను తయారుచేసినట్టు విత్తమంత్రి ఇటీవలే సెలవిచ్చారు. 
 
వచ్చే యేడాది లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ అంశాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని వేతన జీవులకు ఊరట కలిగించేలా ఆదాయపన్ను పరిమితిని రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అలాగే, ఎన్నికలు ఉన్న దృష్ట్యా ఈ దఫా సంక్షేమానికి కేంద్రం ప్రాధాన్యత ఇస్తుందన్న ఆశలో ఉన్నారు. కొత్త పన్ను విధాంలో పన్ను రేట్లను తగ్గించి కొత్త పన్ను స్లాబ్‌లను అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తుందని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. 
 
అయితే, దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పాత పన్ను విధానానికి అదనంగా 2021లో కొత్త పన్ను వ్యవస్థను తీసుకొచ్చింది. పాత పన్ను విధానంలో 3 స్లాబ‌్‌లే ఉండగా కొత్త పన్ను విధానంలో ఆరు స్లాబ్‌లు ఉన్నాయి. 
 
రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆదాయంపై రూ.5 శాతం పన్ను, రూ.5 లక్షల నుంచి రూ.7.5 లక్షల వరకు 10 శాతం పన్ను, రూ.7.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు 15 శాతం, రూ.10 లక్షల నుంచి రూ.12.5 లక్షల వరకు 20 శాతం, రూ.12.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు రూ.25 శాతం, రూ.15 లక్షలకు పైగా ఆదాయం కలిగిన వారికి 30 శాతం పన్ను విధిస్తుంది. అందుకే ఈ దఫా బడ్జెట్‌లో మధ్య తరగతికి పెద్ద పీట వేయాలన్న ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments