Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహేతర సంబంధం.. భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు.. ఎక్కడ?

వివాహేతర సంబంధం హత్యకు దారితీసింది. మరొక వ్యక్తితో తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనే కోపంతో ఆమె భర్త కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కుందుకడవు గ

Webdunia
మంగళవారం, 1 మే 2018 (13:07 IST)
వివాహేతర సంబంధం హత్యకు దారితీసింది. మరొక వ్యక్తితో తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనే కోపంతో ఆమె భర్త కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కుందుకడవు గ్రామానికి చెందిన బిరాజ్ (39) అనే వ్యక్తి ఓ దుకాణంలో పని చేస్తూ జీతు అనే మహిళను పెళ్లాడాడు. ఆ తర్వాత గల్ఫ్ దేశానికి వెళ్లిపోయాడు. 
 
ఈ గ్యాప్‌లో జీతుకు ఫేస్‌బుక్ ద్వారా ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ వ్యక్తితో జీతు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న బిరాజ్.. తన భార్యతో విడాకులు కావాలంటూ కోర్టులో పిటిషన్ వేశాడు. ఈ పరిస్థితుల్లో ఆయన భార్య జీతు పుట్టింటికి వెళ్లిపోయింది. 
 
భర్తను కాదని వేరొక వ్యక్తితో సంబంధం ఏర్పరుచుకున్న జీతుపై కోపంగా వున్న బిరాజ్.. ఆమె ఇంటికెళ్లి కిరోసిన్ పోసి నిప్పంటించేశాడు. తీవ్రగాయాల పాలైన జీతును త్రిసూర్ మెడికల్ కాలేజీకి తరలించారు. పరారీలో ఉన్న బిరాజ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments