Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రాప్ చేస్తామనగానే కారెక్కిన కెన్యా యువతి, ఐదుగురు గ్యాంగ్ రేప్

అత్యాచార ఘటనలు ఎక్కువైపోతున్నాయి. చట్టాలలోని లొసుగులు ఉపయోగించుకుని నేరస్తులు శిక్ష నుండి తప్పించుకుని తిరుగుతున్నారు. తాజాగా గుర్గావ్‌లో నిర్భయ ఘటన లాంటిది ఒకటి జరిగింది. 30 ఏళ్ల కెన్యా దేశస్తురాలు గురువారం నాడు ఇంటికి వెళ్లడానికి క్యాబ్‌ కోసం ఎదురు

Webdunia
శుక్రవారం, 8 జూన్ 2018 (17:50 IST)
అత్యాచార ఘటనలు ఎక్కువైపోతున్నాయి. చట్టాలలోని లొసుగులు ఉపయోగించుకుని నేరస్తులు శిక్ష నుండి తప్పించుకుని తిరుగుతున్నారు. తాజాగా గుర్గావ్‌లో నిర్భయ ఘటన లాంటిది ఒకటి జరిగింది. 30 ఏళ్ల కెన్యా దేశస్తురాలు గురువారం నాడు ఇంటికి వెళ్లడానికి క్యాబ్‌ కోసం ఎదురుచూస్తుండగా, SUV వెహికల్‌లో వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆమెను డ్రాప్ చేస్తామంటూ వాహనాన్ని ఆపారు. 
 
కారులో ఎక్కిన మరుక్షణమే ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించారు. గోల్డ్ కోర్స్ ఎక్స్టెన్షన్ రోడ్డులో మరో ఇద్దరు వ్యక్తులు వారికి తోడయ్యారు. అప్పటికే మద్యం సేవించిన వారు ఆమెను రేప్ చేసారు. ఈ సంఘటన గురించి పోలీసులకు చెప్తే చంపేస్తామని బెదిరించారు. చివరికి ఆమెను నిర్మానుష్య ప్రాంతంలో విడిచి పెట్టారు. 
 
ఆమె తెలివిగా ఆ వెహికల్ నంబర్‌ను నోట్ చేసుకోవడంతో పాటు పోలీసులకు సమాచారం అందించింది. వారు ఆ వెహికల్ నంబర్‌ను ఉపయోగించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు సుందర్, మోహిత్ మరియు ప్రవీణ్‌గా పోలీసులు పేర్కొన్నారు. మరో ఇద్దరి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం