Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ గారూ... మీతో ఓ సెల్ఫీ.... జూ.ఎన్టీఆర్(ఫోటో అదిరింది కదూ)

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నది అందరికీ తెలిసిందే. ఒక రాజకీయంలోనే కాదు.. ఏ రంగంలోనైనా అదే పరిస్థితి. ఒకరేమో తెలుగు సినీ పరిశ్రమలో అగ్రహీరో, మరొకరేమో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత. అస్సలు ఇద్దరికీ పెద్దగా పరిచయం లేదు. రాజకీ

Webdunia
శుక్రవారం, 8 జూన్ 2018 (17:33 IST)
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నది అందరికీ తెలిసిందే. ఒక రాజకీయంలోనే కాదు.. ఏ రంగంలోనైనా అదే పరిస్థితి. ఒకరేమో తెలుగు సినీ పరిశ్రమలో అగ్రహీరో, మరొకరేమో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత. అస్సలు ఇద్దరికీ పెద్దగా పరిచయం లేదు. రాజకీయంగా చూస్తే ఎన్టీఆర్ పక్కా తెలుగుదేశం. తాత ఎన్టీఆర్ పెట్టిన పార్టీకి దగ్గరుండి మరీ ప్రచారం చేశారు జూనియర్ ఎన్టీఆర్. కానీ అప్పట్లో తెలుగుదేశం పార్టీ మాత్రం అధికారంలోకి రాలేదు. ఆ తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు జూనియర్ ఎన్టీఆర్. కానీ చంద్రబాబు నాయుడుతో మాత్రం టచ్ లోనే ఉన్నారు. 
 
ఒకరోజు పాటు పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి హైదరాబాద్‌కు వచ్చారు వై. ఎస్ జగన్. శంషాబాద్ విమానాశ్రయంకు జగన్ చేరుకున్న సమయంలో అక్కడే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారు. ఇద్దరూ రెండు నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. ఒకరినొకరు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఇదంతా బాగానే ఉన్నారు ఉన్నట్లుండి జూనియర్ ఎన్టీఆర్ మీతో ఒక సెల్ఫీ కావాలంటూ అడిగారు. 
 
మీతో లక్షలమంది సెల్ఫీలు తీసుకుని ఉంటారు. కానీ నేనూ మీరూ కలిసి ఒక సెల్ఫీ తీసుకుంటే బాగుంటుందని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. దీంతో జగన్ సరేనన్నారు. జూనియర్ ఎన్టీఆర్ తన సెల్ ఫోన్‌తో సెల్ఫీ తీశారు. ఇద్దరూ నవ్వుతూ ఉన్న సెల్ఫీ బయట పడింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments