Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెరిటేజ్ ప్లాంట్‌లో కలకలం... ఢిల్లీలో ముగ్గురు విలేకరులకు పాజిటివ్

Webdunia
బుధవారం, 29 ఏప్రియల్ 2020 (13:41 IST)
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ పారిశ్రామికవాడలో ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ప్లాంట్లో కలకలం చెలరేగింది. ఇక్కడ పని చేస్తున్న 34 మంది సిబ్బందిని జీహెచ్ఎంసీ అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. ఈ ప్లాంట్‌లో పని చేస్తున్న సెక్యూరిటీ గార్డుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఇక్కడ పనిచేసేవారందరినీ క్వారంటైన్‌కు అధికారులు తరలించారు. 
 
ఈ ప్లాంట్‌లో పని చేస్తున్న ఓ సెక్యూరిటీ గార్డుకు అతని తండ్రి నుంచి కరోనా వైరస్‌ సోకింది. అయితే, ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా నిర్వాహకులు గోప్యత పాటించారు. అతనితో కాంటక్ట్‌ అయిన 33 మందిని గుర్తించి రహస్యంగా ఓ చిన్న ఇంట్లో ఉంచారు.  దీనిపై  స్థానికులు ఫిర్యాదు చేయడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు ప్లాంట్‌ దగ్గరకు వచ్చారు. మొత్తం 34 మంది అనుమానితులను క్వారంటైన్‌కు పంపించారు.
 
మరోవైపు, దేశంలోని పలు రాష్ట్రాల్లో విలేకరులు కరోనా వైరస్ బారినపడుతున్నారు. ముంబై, చెన్నైలలో అనేక మంది జర్నలిస్టులు ఈ వైరస్ బారినపడ్డారు. అలాగే, ఢిల్లీలోకూడా ఉన్నారు. ఇదే విషయంపై ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ, ఢిల్లీలో 529 మంది మీడియా ప్రతినిధులకు పరీక్షలు చేయగా.. కేవలం ముగ్గురికి మాత్రమే పాజిటివ్‌ అని తేలిందని చెప్పారు. 
 
జర్నలిస్టులందరూ క్షేమంగా ఉండాలని ఆయన కోరుకున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల పాత్రికేయుల పని చాలా ముఖ్యమైనదని అన్నారు. కరోనా సోకిన జర్నలిస్టులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని కేజ్రీవాల్ చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

గగన మార్గన్‌ లో ప్రతినాయకుడిగా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధిషన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments