Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నిమ్మగడ్డ' వ్యవహారాన్ని నేరుగా తేలుస్తాం : ఏపీ హైకోర్టు

Webdunia
బుధవారం, 29 ఏప్రియల్ 2020 (13:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనరు (ఎస్ఈసీ)ని అడ్డుదారుల్లో తొలగించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లు దాఖలు చేసిన వారిలో బాధితుడు మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా ఉన్నారు. 
 
ఈ అంశంపై గత కొన్ని రోజులుగా వీడియో కాన్ఫరెన్స్‌లో సాగుతోంది. అలాగే, బుధవారం కూడా విచారణ జరిగింది. ఎస్ఈసీ పదవి నుంచి రమేష్ కుమార్‌ను తొలగించడానికి గల కారణాలను కోర్టుకు ప్రభుత్వం వివరించింది. 
 
అలాగే, నిమ్మగడ్డ వేసిన పిటిషన్లపై కూడా విచారణ జరిపిన న్యాయస్థానం, ఆయన పదవీ కాలం కుదింపు వ్యాజ్యంపై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. అదీ కూడా కోర్టులోనే నేరుగా విచారణ జరుపనున్న్టుట పేర్కొంది. 
 
హైకోర్టులోనే సామాజిక దూరం పాటిస్తూ విచారణకు అందరూ సహకరించాలని ఆదేశించింది. కేసుకు సంబంధించిన న్యాయవాదులను మాత్రమే అనుమతిస్తామని తెలిపింది. ఇందుకోసం పిటిషన్లు, న్యాయవాదులకు హైకోర్టు ప్రత్యేక పాసులు జారీ చేస్తామని తెలిపింది. పాస్‌లు ఇవ్వాల్సిందిగా డీజీపీకి లేఖ రాస్తామని పేర్కొంది.
 
మరోవైపు, బుధవారం జరిగిన విచారణ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌లోకి ఇతరులు రావడంపై హైకోర్టు చివాట్లు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకేసారి 40 మంది వీడియో కాన్ఫరెన్స్‌లోకి ఎలా వచ్చారని ప్రశ్నించింది. వీడియో కాన్ఫరెన్స్‌లోకి ఎంటర్‌ అయ్యే పాస్‌వర్డ్‌ లీక్‌ చేయడం వల్లే ఇలా జరిగివుంటుందని హైకోర్టు న్యాయమూర్తులు అభిప్రాయపడి.. ఈ కేసును నేరుగా కోర్టులోనే విచారిస్తామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెన్నైలో అల్లు అర్జున్, శ్రీలీల 'పుష్ప 2 ది రూల్' మూడవ సింగిల్ 'కిస్సిక్' రిలీజ్

ఇండియా, యుకె, యుఎస్ఏ వ్యాప్తంగా తమ బ్రేక్ త్రూ 2024 కోసం ఎంపికైన వ్యక్తులను వెల్లడించిన బాఫ్టా

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments