Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kedarnath Ropeways: కేదార్‌నాథ్ రోప్ వేకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. 36 నిమిషాల్లోనే తీర్థయాత్ర

సెల్వి
శుక్రవారం, 7 మార్చి 2025 (22:31 IST)
Kedarnath Ropeways
కేదార్‌నాథ్ దర్శనం చేసుకోవాలనే భక్తులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం రూ.4,081 కోట్ల కేదార్‌నాథ్ రోప్‌వే ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేసింది. ఈ కీలక ప్రాజెక్ట్ సోన్‌ప్రయాగ్ నుండి కేదార్‌నాథ్‌కు 8-9 గంటల ప్రయాణ సమయాన్ని కేవలం 36 నిమిషాలకు తగ్గిస్తుందని భావిస్తున్నారు.
 
ఈ మేరకు కేదార్‌నాథ్ రోప్‌వే ప్రాజెక్ట్‌ను డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ (DBFOT) పద్ధతిని ఉపయోగించి రూపొందించనున్నారు. మొత్తం మూలధన వ్యయం రూ.4,081.28 కోట్లు.
 
కేవలం 36 నిమిషాల్లో హేమకుండ్ తీర్థయాత్ర
12.4 కి.మీ పొడవు, రూ. 2,730 కోట్ల వ్యయంతో నిర్మించనున్న హేమకుండ్ సాహిబ్ రోప్‌వే ప్రాజెక్టుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతానికి, గోవింద్ ఘాట్ నుండి హేమకుండ్ సాహిబ్ జీకి చేరుకోవడం అనేది 21 కిలోమీటర్లు ఎక్కాల్సి వుంటుంది.
 
దీనిని కాలినడకన, గుర్రాల మీద లేదా పల్లకీలలో చేయవచ్చు. అయితే 12.9 కిలోమీటర్ల రోప్‌వే ప్రాజెక్ట్ కేదార్‌నాథ్‌కు గంటల తరబడి నడిచి వెళ్ళే యాత్రికులకు ఒక వరం కావచ్చు. ఎందుకంటే అక్కడికి చేరుకోవడానికి వారికి దాదాపు 36 నిమిషాలు మాత్రమే పడుతుంది. 
 
ఈ రోప్‌వే గోవింద్‌ఘాట్, హేమకుండ్ సాహిబ్ జీ మధ్య అన్ని వాతావరణాలలో కనెక్టివిటీకి హామీ ఇస్తుంది. హేమకుండ్ సాహిబ్ జీకి వచ్చే యాత్రికులు, సందర్శకులకు అలాగే పువ్వుల లోయను సందర్శించే పర్యాటకులకు సౌకర్యవంతంగా ఉంటుంది. కేదార్‌నాథ్ రోప్‌వే ప్రాజెక్టును జాతీయ రోప్‌వేల అభివృద్ధి కార్యక్రమం అయిన పర్వతమల పరియోజనలో భాగంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments