Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప.. బోరున విలపించిన సిద్ధరామయ్య

కర్ణాటక రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా బీఎస్.యడ్యూరప్ప గురువారం ఉదయం 9 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో ఆ రాష్ట్ర గవర్నర్ వజూభాయ్ వాలా ప్రమాణ స్వీకారం చేయించారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విర

Webdunia
గురువారం, 17 మే 2018 (11:26 IST)
కర్ణాటక రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా బీఎస్.యడ్యూరప్ప గురువారం ఉదయం 9 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో ఆ రాష్ట్ర గవర్నర్ వజూభాయ్ వాలా ప్రమాణ స్వీకారం చేయించారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విరుచుకుపడ్డారు.
 
ప్రభుత్వం ఏర్పాటు చేసేంత మెజార్టీ లేనప్పటికీ, రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధమైందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని... ఇదే అంశంపై తాము ప్రజల్లోకి వెళ్తామన్నారు. బీజేపీ చేస్తున్న దారుణ రాజకీయాలను ప్రజలకు వివరిస్తామన్నారు. యడ్యూరప్ప తన మెజారిటీ నిరూపించుకోవాలనుకుంటే... ముందు 112 మంది ఎమ్మెల్యేల పేర్లను వెల్లడించాలంటూ సిద్ధరామయ్య బహిరంగ సవాల్ విసిరారు. 
 
ఇకపోతే, బెంగళూరులోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) కార్యాలయంలో నిర్వహించిన కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశంలో సిద్ధరామయ్య కన్నీళ్లు పెట్టుకున్నారు. పేదలు, దళితులు, మహిళలు, విద్యార్థుల సంక్షేమానికి కాంగ్రెస్ చేసిన కృషిని ఎన్నికల్లో ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. 
 
సంక్షేమ పథకాలను విస్మరించి కేవలం కులాలు, జాతుల అంశాలకే ప్రాధాన్యం ఇచ్చి ప్రజలు తమను ఓడించారని పేర్కొన్నారు. తమ ప్రణాళికలను ప్రజలే మార్చేశారని అన్నారు. విజయంపై ఎంతో ధీమాగా ఉన్నప్పటికీ జనం తమను ఓడించారని ఆవేదన వ్యక్తంచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నవగ్రహ ఫేమ్ కన్నడ నటుడు గిరి దినేష్ ఇక లేరు.. గుండెపోటుతో మృతి

అడ్వైజరీ బోర్డ్‌లో భాగం చేసినందుకు ప్ర‌ధాని మోదీకి చిరంజీవి ధ‌న్య‌వాదాలు

త్రిబాణధారి బార్భరిక్ మూవీ నుంచి సిద్ శ్రీరామ్ సాంగ్ రిలీజ్

రమేష్ బాబు ఎందరినో మోసం చేసాడు, సివిల్ కోర్టులో కేసు నడుస్తోంది : -ఫైనాన్సియర్స్ సదానంద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాలెంటైన్స్ డే: ఈ సీజన్‌లో కాలిఫోర్నియా బాదంపప్పులతో ప్రేమ, ఆరోగ్యాన్ని వ్యాప్తి చేయండి

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

తర్వాతి కథనం
Show comments