రూ.50వేల అప్పు.. తిరిగి చెల్లించలేదు.. మహిళను స్తంభానికి కట్టేసి? (video)

Webdunia
శుక్రవారం, 14 జూన్ 2019 (14:31 IST)
అప్పును తిరిగి చెల్లించలేని మహిళపై దారుణం జరిగింది. రుణాన్ని తిరిగివ్వలేని మహిళను కరెంట్ స్తంభానికి కట్టివేసి దాడి చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ అమానుష చర్యపై సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక, సామ్‌రాజ్ నగర్ జిల్లా, కొడిహెల్లికి చెందిన రాజామణికి 36 ఏళ్లు. 
 
ఈమె ఆ గ్రామంలో చిన్న హోటల్ నిర్వహిస్తోంది. అంతేగాకుండా చిట్ ఫండ్ బిజినెస్ కూడా చేస్తోంది. ఈ నేపథ్యంలో రూ.50వేల వరకు రాజామణి అప్పు తీసుకుంది. ఇంకా తీసుకున్న రుణాన్ని తిరిగి ఇవ్వలేకపోయింది. అయితే రాజామణికి రుణంగా డబ్బులిచ్చిన వారు ఆమెపై దాడికి పాల్పడ్డారు. ఆమెను కరెంట్ స్తంభానికి కట్టివేసి చిత్ర హింసలకు గురిచేశారు. 
 
వీడియోలో ఆమెను చెప్పులతో, చీపురుతో దాన్ని కొట్టండి అంటూ తీవ్రంగా దూషించడం, హింసించడం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై రచ్చ మొదలు కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. 
 
ముందుగా రాజామణిని విద్యుత్ స్తంభంలో కట్టేసిన ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఇంకా వడ్డీకి డబ్బులిచ్చి.. బాధిత మహిళను తీవ్రంగా హింసించిన వారిపై తగిన చర్యలు తీసుకోనున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్.. దివ్వెల మాధురి ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ భారీగా తీసుకుందా?

Ashika Ranganath :స్పెషల్ సెట్ లో రవితేజ, ఆషికా రంగనాథ్ పై సాంగ్ షూటింగ్

SSMB29: రాజమౌళి, మహేష్ బాబు సినిమా అప్ డేట్ రాబోతుందా?

Shyamala Devi : గుమ్మడి నర్సయ్య దర్శకుడిని ప్రశంసించిన శ్యామలా దేవీ

NBK 111: బాలక్రిష్ణ నటిస్తున్న ఎన్.బి.కె. 111 చిత్రం నవంబర్ 7న ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments