Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆపరేషన్ థియేటర్‌లో కూడా మహిళపై వేధింపులా? ఇదేం కర్మండీ బాబోయ్..

Advertiesment
ఆపరేషన్ థియేటర్‌లో కూడా మహిళపై వేధింపులా? ఇదేం కర్మండీ బాబోయ్..
, శుక్రవారం, 14 జూన్ 2019 (11:44 IST)
మహిళలపై ఎక్కడపడితే అక్కడ లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. బస్సుల్లో, ఇళ్లు, కార్యాలయాల్లో మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో.. తాజాగా ఆపరేషన్ థియేటర్లో కూడా మహిళలపై కామాంధులు విరుచుకుపడుతున్నారు. చెన్నైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో ఈ దారుణం చోటుచేసుకుంది. 
 
అనారోగ్యం కారణంగా ఓ మహిళకు శస్త్రచికిత్స చేస్తుండగానే ఆమెపై లైంగిక వేధింపులు చోటుచేసుకున్నట్లు వార్త బహిర్గతం అయ్యింది. వివరాల్లోకి వెళితే.. చెన్నై పెరుంగుడిలోని ఓ ఆస్పత్రిలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ పారిశ్రామిక వేత్త కుమార్తెకు చికిత్స జరిగింది. కాలి మోకాలికి ఏర్పడిన గాయానికి శస్త్రచికిత్స చేశారు. 
 
జూన్ ఆరోతేదీన ఆమెకు ఆపరేషన్ చేశారు. ఆ సమయంలో ఆపరేషన్ థియేటర్లోనే వైద్యులు నడుముకు కింది భాగంలో చలనం లేకుండా వుండేందుకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. ఇంకా కృత్రిమ శ్వాసను ఆమెకు అందించారు. ఆ సమయంలో తలవైపు నిలబడిన ఓ ఆస్పత్రి సిబ్బంది ఆమెను లైంగికంగా వేధించాడు. శ్వాస తీసుకోవడం కూడా కష్టతరమైన సందర్భంలో ఆమెకు ఎదురైన చేదు ఘటనకు సంబంధించి.. ఆపరేషన్ ముగిశాక వైద్యులకు ఫిర్యాదు చేసింది. 
 
కానీ వారు పెద్దగా పట్టించుకోలేదు. చివరికి ఆన్‌లైన్ ద్వారా పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై ఆస్పత్రికి మఫ్టీలో వెళ్లిన పోలీసు విచారించడంలో నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇంకా ఆపరేషన్ థియేటర్లో మహిళను వేధించిన సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మరదలిపై బావ అత్యాచారం.. గర్భవతి చేశాడు... అబార్షన్ చేయాలన్నాడు..