Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పులి ఎక్కడ కనబడితే అక్కడే కాల్చి చంపి పారేయండి

Webdunia
శనివారం, 13 మార్చి 2021 (13:25 IST)
కర్నాటక కొడగు జిల్లాలో పెద్దపులి మనిషి రక్తాన్ని మరిగి చాటునుంచి పంజా విసురుతూ వారం రోజుల్లో నలుగురిని పొట్టనబెట్టుకుంది. దీనితో ఆ ప్రాంత ప్రజలు పెద్దఎత్తున నిరసనకు దిగారు. ఆ పులిని మీరైనా చంపండి లేదంటే మేమే అడవిలోకి వెళ్లి దాని అంతం చూస్తామని రోడ్డుపై బైఠాయించారు.
 
దీనితో కొడగులో పులిని చంపడానికి కాల్పుల ఉత్తర్వు జారీ చేసినట్లు కర్ణాటక అటవీ శాఖ మంత్రి అరవింద్ లింబవాలి తెలిపారు. పులిని చంపడానికి స్థానికులను అనుమతించాలని డిమాండ్ చేసిన బిజెపి ఎమ్మెల్యేలు కెజి బోపయ్య, అప్పచు రంజన్‌లపై లింబవాలి స్పందిస్తూ, జంతువులను చంపడానికి సభ్యులకు(లేదా స్థానికులకు) హక్కు లేదని అన్నారు.
 
"అవసరమైన చర్యలు తీసుకోవాలని నేను ఇప్పటికే అధికారులను ఆదేశించాను. మనుషులను చంపుతున్న ఆ పులిని ఎక్కడ కనబడితే అక్కడ కాల్చి చంపాలని నేను ఆదేశించాను,” అని హామీ ఇచ్చారు. ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో కనీసం నలుగురు వ్యక్తులు పులివాత పడి మృత్యవాత పడ్డారు. 
 
పులి దాడుల్లో అనేక జంతువులు చనిపోయాయి. ఒకే పులి వల్ల ఈ మరణాలు సంభవించాయా లేదా ఈ ప్రాంతంలో మరిన్ని పులుల సంచారం వున్నదా అనే విషయం ఇంకా స్పష్టంగా తెలియదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments