గుమస్తా ఉద్యోగి నెల వేతనం రూ.15 వేలు.. ఆస్తులు రూ.30 కోట్లు

ఠాగూర్
శుక్రవారం, 1 ఆగస్టు 2025 (12:56 IST)
కర్నాటక రాష్ట్రంలో ఓ ప్రభుత్వ మాజీ ఉద్యోగి బండారం బయటపడింది. నెలకు రూ.15 వేలు వేతనం తీసుకునే ఆ ఉద్యోగి ఆస్తులు మాత్రం రూ.30 కోట్లుగా ఉన్నాయి. ఈ విషయం లోకాయుక్త అధికారులు జరిపిన ఆకస్మిక తనిఖీల్లో వెలుగు చూశాయి. ఇంతకీ ఆ ఉద్యోగి చేసేది గుమస్తా ఉద్యోగం. అతనిపై అవినీతి ఆరోపణలు రావడంతో లోకాయుక్త అధికారులు సోదాలు జరిపిపారు. అప్పట్లో ఆయన జీతం నెలకు రూ.15వేలు కాగా.. ఆస్తులు మాత్రం రూ.30 కోట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
 
కర్నాటక రాష్ట్రంలోని కొప్పల్‌ జిల్లాలోని కర్ణాటక గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి లిమిటెడ్‌‌లో కలకప్ప నిడగుండి అనే వ్యక్తి గుమస్తాగా చేసి రిటైరయ్యారు. నెలకు రూ.15 వేలు జీతానికి పనిచేశారు. అందులోనే మాజీ ఇంజినీర్‌గా ఉన్న జెడ్ఎం.చిన్చోల్కర్‌తో కలిసి నిడగుండి పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. 
 
పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నకిలీ పత్రాలు, నకిలీ బిల్లులు సృష్టించడంతో పాటు దాదాపు రూ.72 కోట్లకు పైగా దుర్వినియోగం చేశారనేది ప్రధాన ఆరోపణ. దీనిపై లోకాయుక్తకు ఫిర్యాదు అందడంతో కోర్టు ఆదేశాలమేరకు నిడగుండి ఇంట్లో అధికారులు సోదాలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments