Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

Advertiesment
OG movie first blast poster

దేవీ

, శుక్రవారం, 1 ఆగస్టు 2025 (11:11 IST)
OG movie first blast poster
సంగీత దర్శకుడు థమన్ తాజాగా చేస్తున్న సినిమా ఓజీ. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా రూపొందిస్తున్న ఈ సినిమా ఫస్ట్ బ్లాస్ట్ పేరుతో ఫస్ట్‌లుక్‌, గ్లింప్స్‌, మ్యూజిక్ ను ఆగస్టు 2వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇదే విషయాన్ని చిత్ర యూనిట్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఫస్ట్‌ గ్లింప్స్‌కు తమన్‌ ఇచ్చిన బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ అయితే ఏ రేంజ్‌లో హైలైట్‌ అయింది. పవన్‌ కల్యాణ్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది.
 
ఇప్పటికే హరిహరవీరమల్లు సినిమా విడుదలయి సాదాగా ప్రదర్శితమవుతోంది. ఇప్పుడు మరో సినిమా ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ చిత్రం కోసం బెంగుళూరులో షూటింగ్ సందర్భంగా కసరత్తు చేస్తూ పవన్ కనిపించారు. ఇప్పటికే ఓజీ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నారు. సెప్టెంబర్ లో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. కనుక ఓజీ ని సెప్టెంబర్‌ 25న ఓజీ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రాన్ని డి.వి.వి. దానయ్య నిర్మించారు.

విశ్వసనీయ సమాచారం మేరకు ఓజీ సినిమాను ముందుగానే రిలీజ్ చేసి, ఆ తర్వాత హరిహర వీరమల్లు విడుదలచేస్తే ప్లస్ అయ్యేదని దానయ్య సన్నిహితుల వద్ద చెప్పినట్లు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఊర్వశి రౌతేలాకు షాక్.. లండన్‌లో బ్యాగు చోరీ