Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యాక్సిన్ వేయించుకున్నా.. కరోనా వైరస్ సోకింది... ఎక్కడ?

Webdunia
సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (11:06 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు పలు ఫార్మా కంపెనీలు కరోనా టీకాలను అభివృద్ధి చేయగా, వీటిని ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వినియోగిస్తున్నారు. అలాగే, మన దేశంలో కూడా ఈ టీకాలను వేశారు. అయితే, ఈ వ్యాక్సిన్ వేయించుకున్న ఐదుగురికి ఈ వైరస్ సోకింది. ఈ ఐదుగురు కూడా వైద్యులే కావడం గమనార్హం. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని చామరాజనగర్ జిల్లాలో జరిగింది. 
 
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా చామరాజనగర్ జిల్లాలో కరోనా టీకాను తీసుకున్న ఐదుగురు డాక్టర్లు మహమ్మారి బారినపడ్డారు. ఈ విషయం స్థానికంగా కలకలం రేపింది. వీరికి తొలి డోస్‌ను తీసుకున్న వారం వ్యవధిలోనే కరోనా సోకింది. దీంతో వ్యాక్సిన్ పనితీరుపై వైద్య సిబ్బంది అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. 
 
అయితే, వ్యాక్సిన్ తీసుకున్న వారం వ్యవధిలో కరోనా సోకినంత మాత్రాన టీకా పనితీరు బాగాలేదని భావించనక్కర్లేదని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. టీకా తీసుకున్న తర్వాత దాదాపు 40 రోజులకు శరీరంలో యాంటీ బాడీలు వృద్ధి చెందుతాయని అంటున్నారు.
 
కాగా, తొలి డోస్ తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోస్‌ టీకా వేయించుకోవాల్సి వుంది. రెండో డోస్ తీసుకున్న పది రోజులకు శరీరంలో యాంటీ బాడీలు పెరుగుతాయని, అప్పుడే కరోనా వైరస్‌ను ఎదుర్కొనే శక్తి శరీరానికి వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 
 
టీకా తొలి డోస్ తీసుకున్న వారు కూడా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని, మాస్క్‌లు ధరించడం, చేతులను శుభ్రం చేసుకుంటూ, బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించడం తప్పనిసరని వైద్య నిపుణులు సూచించారు. 

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments