Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బెంగళూరు: 25 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్

Advertiesment
బెంగళూరు: 25 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్
, గురువారం, 28 జనవరి 2021 (07:45 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా తగ్గలేదు. కర్ణాటకలోని సోమ్‌వర్‌పేట తాలూక పరిధిలోని ఓ కళాశాలలో 25 మంది విద్యార్థులు కరోనా పాజిటివ్‌గా పరీక్షించారు. గారాగండురులోని మొరార్జీ దేశాయ్‌ పీయూ కళాశాలలో ఈ నెల 11 నుంచి ఆఫ్‌లైన్‌లో తరగరతులు నిర్వహిస్తున్నారు. సుమారు 76 మంది విద్యార్థులకు తరగతులకు హాజరవుతున్నారు. వీరందరికీ ఇంతకు ముందు కరోనా పరీక్షలు నిర్వహించగా.. నెగెటివ్‌ వచ్చింది. 
 
అయితే ఈ నెల 21న తరగతులకు హాజరవుతున్న విద్యార్థుల్లో ఒకరికి జ్వరం వచ్చింది. దీంతో ఆ విద్యార్థి కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని కాలేజీ యాజమాన్యం సూచించింది. అనంతరం నిర్వహించిన పరీక్షల్లో వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షించాడు. 
 
ముందస్తుగా మిగతా విద్యార్థులందరికీ పరీక్షలు చేయించగా.. 25 మంది మహమ్మారి బారినపడ్డారని అధికారులు బుధవారం తెలిపారు. దీంతో అధికారులు కళాశాలను 14 రోజుల పాటు మూసివేశారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం స్థిరంగానే ఉందని వైద్యులు ధ్రువీకరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2020 ఏప్రిల్-డిసెంబర్ కాల వ్యవధిలో రూ. 7 లక్షల కోట్లకు పైగా సమ్ ఇన్సూర్డ్ విక్రయం