Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరకట్నం కోసం పెళ్లి ఆపేసిన తల్లిదండ్రులు.. పోలీసులు ఏం చేశారో తెలుసా?

Webdunia
మంగళవారం, 13 నవంబరు 2018 (13:57 IST)
వరకట్నం కోసం అమ్మాయి తరపు వారిని వేధిస్తూ.. తన పెళ్లికి ఆటంకం కలిగిస్తున్నారని ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు తమ సొంత ఖర్చుతో ఆ యువకుడి వివాహం జరిపించిన ఘటన తమిళనాడు ఈరోడ్డులో చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే... తమిళనాడు, ఈరోడ్డు జిల్లా తాళవాడి ప్రాంతానికి చెందిన రాజన్న (21)కు కర్ణాటక, సామ్రాజ్ నగర్ తాలూకా, జ్యోతికవుడనపురం ప్రాంతానికి చెందిన అంబికా (25) అనే అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. 
 
వీరిద్దరి వివాహం నవంబర్ ఐదో తేదీన జరుగుతుందని నిశ్చయించారు. అయితే వరకట్నం కోసం రాజన్న తల్లిదండ్రులు అంబికా తరపు వారిని వేధించడం మొదలెట్టారు. అయితే అంబికా తల్లిదండ్రులు వారి కోరిన మొత్తాన్ని ఇవ్వలేమని చెప్పడం రాజన్న- అంబికాల వివాహం ఆగిపోయింది.

ఇంతలోనే రాజన్న-అంబికాల మధ్య ప్రేమ చిగురించింది. వరకట్నం వద్దని రాజన్న అతడి తల్లిదండ్రులకు ఎంత చెప్పినా.. వారు వరకట్నం ఇవ్వాల్సిందేనని పట్టుబట్టడంతో.. వేరు దారిలేక బెంగళూరు సామ్రాజ్ నగర్ పోలీసులకు రాజన్న తన తల్లిదండ్రులపైనే ఫిర్యాదు చేశాడు. 
 
ఈ ఫిర్యాదు మేరకు సామ్రాజ్ నగర్ పోలీసులు ఇరు కుటుంబీకులకు చెందిన పెద్దలను పిలిపించి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ రాజన్న కుటుంబీకులు వరకట్నం కోసం పోలీసుల ముందే పట్టుబట్టారు.

దీంతో పోలీసులే రాజన్న తల్లిదండ్రులకు వారడిగిన రెండు లక్షల కట్నం ఇచ్చి అంబికతో రాజన్న పెళ్లిని నవంబర్ 10వ తేదీన పోలీస్ స్టేషన్‌లోనే జరిపించారు. ఈ ఘటనతో పోలీసులను స్థానికులు అభినందించారు. అంతేగాకుండా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు పోలీసులను ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వంద రోజుల పాటు ఆలరించిన రియాలిటీ షో ... నేడు బిగ్‌బాస్ టైటిల్ ప్రకటన

ఎస్ఎస్ రాజమౌళి డ్యాన్స్ అదరహో (Video)

టైం బాగోలేనప్పుడు చాలాసార్లు ధైర్యం ఇచ్చింది నానినే : అల్లరి నరేష్

ఇంతకుముందులా శంకర్ చిత్రం మిస్ ఫైర్ కాదు. గేమ్ ఛేంజర్ లో ట్విస్టులు ఉంటాయి : శ్రీకాంత్

డాకు మహారాజ్ నుంచి డేగ డేగ డేగ దేఖో వో దేఖో బేగా.. గీతం విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments