Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 1 April 2025
webdunia

ప్రేమ సజీవంగా ఉండాలంటే ఇలా చేయండి...

Advertiesment
Romantic
, ఆదివారం, 11 నవంబరు 2018 (09:52 IST)
రోజంతా పోటీ ప్రపంచంతో పోటీ పడి పరుగెత్తి రాత్రి ఇంటికి వచ్చే సమయానికి బాగా అలసి పోయి రావడం సహజం. దీంతో దంపతుల మధ్య రొమాన్స్, ప్రేమలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయని అనేక సర్వేలు చెపుతున్న నిజం. 
 
కానీ, అనేక మంది దంపతుల్లో మాత్రం దశాబ్దాల తరబడి రొమాన్స్ సాగించిన తర్వాత కూడా ప్రేమ, సరససల్లాపాలు సజీవంగానే ఉన్నాయి. దీనికి కారణం లేకపోలేదు. ఏళ్ల తరబడి సంసారం జీవనం సాగించిన తర్వాత కూడా దంపతులు పరస్పరం ప్రేమను, రోమాన్స్‌ను ఓ అలవాటుగా కాకుండా సజీవంగా ఉంచుకోవాల్సిన ఎంతైన ఉందని అంతర్జాతీయ సెక్స్‌నిపుణులు, సైకాలజిస్టులు చెపుతున్నారు. 
 
ఇందుకోసం ప్రాథమికంగా కొన్ని జాగ్రత్తల తీసుకుంటే సరిపోతుందని వారు సూచిస్తున్నారు. ప్రేమను కాపాడుకోవాలని చైతన్యపూరితమైన నిర్ణయం తీసుకోవాలట. మీ భాగస్వామి పట్ల మిమ్మల్ని ఆకర్షితులను చేసే అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టినట్టి, ఆమెకు లేదా ఆయనకు ఇష్టమైన రెస్టారెంట్లు, ఇతరాత్రా ప్రాంతాలకు తీసుకెళ్లడం ద్వారా దంపతుల మధ్య రోమాన్స్‌ను సజీవంగా ఉంచుకోవచ్చట. 
 
దంపతులిద్దరూ కలిసి చేయాల్సిన పనులపై ముందుగానే ఒక కార్యాచరణ రూపొందించుకుని వాటిని పూర్తి చేసేందుకు రెండు, మూడు రోజుల పాటు తమతమ కొలువులకు సెలవు పెట్టి కలిసి చేస్తే ఎంతో మంచిది. ఈ సెలవుల్లో తమకు ఇష్టమైన ప్రదేశాలు, ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తే మరీ మంచిదని చెపుతున్నారు. 
 
తమ భవిష్యత్ కోసం ప్రణాళికలను పూర్తి చేయడం మొదలు పెట్టాలి. భాగస్వామికి ఇష్టమైన కళలో శిక్షణ ఇప్పించేందుకు ప్రయత్నించాలి. భాగస్వామి ధరించే దుస్తుల పట్ల భర్త ఇష్టాన్ని ప్రదర్శించడం వంటి పనులు చేయాలి. 
 
శారీరకంగా అందంగా కనిపించడానికి ప్రయత్నాలు చేయండి. దుస్తులు ధరించడం మీ భాగస్వామికి ఇష్టమయ్యేలా ఉండాలి. ఇలాంటి చిన్నచిన్న విషయాల్లో కాస్త జాగ్రత్త వహించినట్టయితే.. దంపతుల మధ్య ప్రేమ ఎప్పటికీ సజీవంగానే ఉంటుందని, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రక్తపోటు(బీపీ)ను అదుపులో ఉంచే పండ్లు ఏంటి?