Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 22 April 2025
webdunia

30 యేళ్ళు దాటిన తరువాత పెళ్ళిచేసుకునేవారు.. ఇది చదవాల్సిందే..!

Advertiesment
Marriage
, సోమవారం, 12 నవంబరు 2018 (12:28 IST)
జీవితంలో స్థిరపడ్డాకే పెళ్ళి. ఈమధ్య కాలంలో చాలామంది యువతీయువకులు ఫాలో అవుతున్న సూత్రమిది. పెళ్ళి తరువాత కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడటం ఇష్టం లేక కొంతమంది ఆలస్యంగా వివాహం చేసుకుంటున్నారు. అంతేకాదు పెళ్ళి తరువాత ఎలాంటి ఇబ్బందులు కలిగినా ఆర్థికంగా నిలదొక్కుకోగలమన్న నమ్మకం ఏర్పడేంత వరకు చాలామంది వివాహాలు చేసుకోవడం లేదు. అందుకే చాలామంది 30 లేదా 35 సంవత్సరాలు దాటాకే వివాహాలు చేసుకుంటున్నారు.
 
స్థిరపడ్డాకే పెళ్ళి అన్న ఆలోచన మంచిదైనప్పటికీ 35 యేళ్ళు దాటాక పెళ్ళి అంటే మాత్రం ఇబ్బందులు తప్పవట. 30 యేళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి జీవితం మీద పూర్తి అవగాహన వచ్చేస్తుంది. డబ్బు యొక్క ప్రాముఖ్యత తెలిసి వస్తుంది. ఈ సమయంలో పెళ్ళయితే సదరు యువతీయువకుల ప్రధాన లక్ష్యం వీలైనంత డబ్బు సంపాదించాలనే ఉంటుంది. ఈ క్రమంలో తమ వైవాహిక జీవతం మీద బాగా శ్రద్థపెట్టరు. ఒకరి ఇష్టాఇష్టాలను అస్సలు పట్టించుకోరు. దీంతో వైవాహిక జీవితం సాఫీగా సాగదు. 25 దాటిన తరువాత పెళ్ళికి సరైన వయస్సు.
 
30 దాటాక స్త్రీ, పురుషులలో కోరికలు తగ్గుతాయట. ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ తగ్గి వైవాహికజీవితం అంత సాఫీగా సాగదు. ఈ వయస్సు వచ్చేసరికి ఉద్యోగపరంగా సీనియారిటీ రావడం, కొన్ని అదనపు బాధ్యతలు మోయాల్సి రావడంతో జీవిత భాగస్వామికి తగిన సమయం కేటాయించడం లేదు. ఇది వివాహేతర సంబంధానికి కూడా దారితీస్తుందట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చికెన్ టిక్కా తయారీ విధానం...