Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూతురిపై తండ్రి అఘాయిత్యం.. బెదిరించి బాబాయ్ కూడా..

Webdunia
మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (10:01 IST)
కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కన్నకూతురి పాలిట కామపిశాచిగా మారాడు. ఎదిగిన కూతురిపై కన్నేసిన ఓ దుర్మార్గపు తండ్రి, ఏడాది కాలంగా ఆమెపై తన వికృత చేష్టలతో దారుణానికి ఒడిగట్టాడు. ఈ విషయం తెలుసుకున్న బాబాయి కూడా ఆమెను బెదిరించి బలవంతంగా తన కోరికను తీర్చుకున్నాడు. కర్ణాటకలో జరిగిన ఈ సంఘటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
 
17 ఏళ్ల యువతి వరుసకు బాబాయ్ అయ్యేటువంటి వ్యక్తి ఇంటికి వెళ్లింది. ఆ బాలికపై అతనికి కన్ను పడింది. ఆమెను ఎలాగైనా ఆ రాత్రి అక్కడే ఉంచేందుకు ప్లాన్ వేశాడు. తనలో ఉన్న రాక్షసత్వాన్ని బయటపెట్టాడు. ఆమెను బెదిరించి బలవంతంగా అత్యాచారం చేసాడు. అతని వికృత చేష్టలకు తట్టుకోలేని బాధితురాలు ఈ విషయాన్ని తన తల్లికి తెలిపింది. దీంతో బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 
 
అయితే పోలీసుల విచారణలో షాకింగ్ విషయం బయటపడింది. సదరు యువతిపై ఆమె తండ్రే ఏడాది కాలంగా అఘాయిత్యానికి పాల్పడుతున్నాడని నిందితుడు పోలీసులకు వివరించాడు. ఆ విషయం తెలిసే.. తాను కూడా ఆమెపై లైంగిక దాడి చేసినట్లు నిందితుడు వివరించాడు. ఇదే విషయాన్ని బాధితురాలు కూడా అంగీకరించింది. తన తండ్రి కూడా ఏడాదికాలంగా ఇదే విధంగా ప్రవర్తిస్తున్నాడని ఆమె తల్లి ముందు బోరున ఏడ్చింది. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు పరారీలో ఉన్న ఆమె తండ్రి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం