Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ ప్రాచీన ఆలయంలో ఘంటసాల పాట వినిపించిన జ్యోతి మల్హోత్రా!!

ఠాగూర్
మంగళవారం, 20 మే 2025 (12:37 IST)
శత్రుదేశం పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ అరెస్టయిన మహిళా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గురించి లోతుగా విచారణ జరిపేకొద్దీ అనేక ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే ఆమెకు పాకిస్థాన్‌కు చెందిన అనేక మందితో సంబంధం ఉన్నట్టు తేలింది. ఈ నేపథ్యంలో తాజాగా పాకిస్థాన్‌‍లోని ఓ ప్రాచీన ఆలయంలో గానగంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు ఆలపించిన అచ్చ తెలుగు పాట వినిపించడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. 
 
ఈమె గతంలో చిత్రీకరించిన ఓ వీడియో ద్వారా ఈ ఆసక్తికర దృశ్యం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. తెలుగువారిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సుమారు రెండు నెలల క్రితం పాకిస్థాన్‌లోని ప్రసిద్ధ కటాస్ రాజ్ ఆలయ సముదాయాన్ని సందర్శించింది. 
 
ఆ పర్యటనలో భాగంగా ఆలయ విశిష్టతను వివరిస్తూ ఆమె ఓ వీడియోను చిత్రీకరించి తన యూట్యూబ్ ఛానల్‌లో అప్‌‍లోడ్ చేశారు. ఆ వీడియోలో 6 నిమిషాల 50 సెకన్ల వద్ద జ్యోతి మల్హోత్రా కటాస్ రాజ్ ఆలయ ప్రాంగణంలోని ఆంజనేయస్వామి ఆలయం వైపు వెళుతుండగా ఓ అద్భుతం చోటుచేసుకుంది.
 
ఆలయం లోపలి నుంచి ఎవరో ఒక వ్యక్తి అత్యంత మధురంగా, భక్తిశ్రద్ధలతో ఓ తెలుగు సినిమా పాటను పాడుతుండటం స్పష్టంగా వినిపించింది. మన ఘంటసాల మాస్టారు పాడిన 'భూకైలాస్' చిత్రంలోని ‘రాముని అవతారం రవికుల సోముని అవతారం' అనే సుప్రసిద్ధ గీతం. ఆలయంలో 'కూర్చుని ఓ
పెద్దాయన ఈ పాటను ఆర్తితో ఆలపిస్తున్న దృశ్యం కూడా వీడియోలో కనిపించింది. పరాయి దేశంలో, అందులోనూ పాకిస్థాన్‌లో మన తెలుగు పాట, అదీ ఘంటసాల గళమాధుర్యాన్ని గుర్తుకుతెచ్చేలా ఓ వ్యక్తి పాడుతుండటం తెలుగువారందరినీ ఆకట్టుకుంటోంది.
 
కాగా, జ్యోతి మల్హోత్రా ఇటీవల గూఢచర్యం ఆరోపణలపై అరెస్టు కావడంతో ఆమె యూట్యూబ్ ఛానల్‌లోని వీడియోలపై చాలామంది దృష్టి సారించారు. ఈ క్రమంలోనే కటాస్ రాజ్ ఆలయ వీడియోలోని ఈ అరుదైన ఘట్టం బయటకు వచ్చి, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతోంది. దేశాలు వేరైనా, భాషలు వేరైనా సంగీతానికి, ముఖ్యంగా మన ఘంటసాల పాటలకు సరిహద్దులు లేవని ఈ సంఘటన నిరూపిస్తోందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments