Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రి చనిపోయారు... కానీ ఆయన నిర్దోషి అని నిరూపించేందుకు పోరాడిన సంతానం...

Webdunia
మంగళవారం, 5 మార్చి 2019 (20:34 IST)
లంచం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఓ డాక్టర్ నిర్దోషి అని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. కాకపోతే చాలా ఆలస్యంగా సదరు వ్యక్తికి న్యాయం లభించింది. కేసు నమోదై 32 సంవత్సరాలు గడిచిన తర్వాత కోర్టులో ఇప్పుడు ఆయన నిర్దోషిత్వం రుజువైంది. కానీ తీర్పు వినడానికి ఆయన లేరు. నాలుగేళ్ల క్రితం కాలం చేసారు. నిశికాంత్ కులకర్ణి అనే ఆ వైద్యుడు మహారాష్ట్రలోని మన్మాడ్ మునిసిపాలిటీ హాస్పిటల్‌లో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేసేవారు. 
 
వంద రూపాయలు తీసుకుని డెత్ సర్టిఫికేట్ ఇచ్చారని ఆయనపై 1987 సెప్టెంబర్‌లో కేసు నమోదైంది. అయితే ఓ వ్యక్తి తన సోదరుని మరణ ధృవీకరణ పత్రం కోసం నిశికాంత్ 150 రూపాయల లంచం అడిగినట్లు, చివరకు 100 రూపాయలకు బేరం కుదిరిందని ఏసీబీకి ఫిర్యాదు చేసాడు. ఈ కేసుపై సెషన్స్ కోర్టు 2005లో తీర్పు చెప్పింది. డాక్టర్‌కు ఒక ఏడాది, ప్యూనుకు ఆరునెలల శిక్ష పడింది. 
 
కాగా లంచం తీసుకుంది ప్యూను కాబట్టి నిందితులు దీనిపై హైకోర్టుకు వెళ్లారు. కేసు నడుస్తుండగానే డాక్టరు వృద్ధాప్యం వల్ల చనిపోయాడు. ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ఆయన నిర్దోషిత్వాన్ని రుజువు చేయాలనే పట్టుదలతో హైకోర్టులో కేసును కొనసాగించారు. చివరకు విజయం సాధించారు. కాగా ఆ విజయాన్ని చూసుకునేందుకు ఆ డాక్టరు లేకపోవడం విచారకరం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments