Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్లాసుతో ఎన్నో జ్ఞాపకాలున్నాయ్.. ఈసీకి ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్

Webdunia
ఆదివారం, 23 డిశెంబరు 2018 (17:45 IST)
కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గాజు గ్లాసును కేటాయించింది. వచ్చే లోక్‌సభ ఎన్నికలతో పాటు.. అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఈ గుర్తునే జనసేనకు కేటాయించింది. దీనిపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. 
 
తమ పార్టీకి గాజు గ్లాసును కేటాయించిన ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు తెలిపారు. తన చిన్నతనం నుంచి గాజు గ్లాసుతో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని ఆయన ట్విట్టర్ ద్వారా చెప్పారు. మన దేశంలోని సాధారణ పౌరుడి గుర్తింపు కూడా ఇదేనని అన్నారు. అ సందర్భంగా గాజు గ్లాసు ఫొటోను అప్ లోడ్ చేశారు. 
 
కాగా, సినీ నటుడు పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ తన ఎన్నికల గుర్తును ప్రకటించింది. వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాజు గుర్తుపై పోటీ చేయనున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. దేశవ్యాప్తంగా కొత్తగా నమోదైన 29 పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తులను కేటాయించింది. 
 
ఇందులోభాగంగా పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేనకు కూడా గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. 2019లో జరగనున్న సాధారణ ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసే అభ్యర్థులు ఈ గుర్తు మీద పోటీ చేస్తారు. 
 
పార్లమెంటు ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నక్రమంలో… అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి ఇదే గుర్తు వర్తిస్తుందని తెలిపింది ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ విషయాన్ని తమ పార్టీ ట్వట్టర్ ఖాతాలో జనసేన అధికారికంగా ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

'సిరివెన్నెల'కు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments