Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్‌లో సాగుతున్న ఉగ్రవేట... ఆయుధాలతో ఇద్దరి అరెస్టు - యుద్ధ సన్నద్ధతపై కీలక భేటీ!!

ఠాగూర్
మంగళవారం, 6 మే 2025 (11:59 IST)
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. దేశ వ్యాప్తంగా అలెర్ట్ ప్రకటించాయి. ఇందులోభాగంగా, జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో మాత్రం ఉగ్రవేట కొనసాగుతోంది. తాజాగా నిర్వహించిన తనిఖీల్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. వారి నుంచి ఆయుధాలతో పాటు గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. 
 
ఉగ్ర వ్యతిరేక ఆపరేషన్‌లో భాగంగా, బుద్గాంలో నాకా చెకింగ్ చేపట్టారు. ఈ క్రమంలోనే అనుమానాస్పద కదలికలతో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని తనిఖీ చేయగా, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, ఫిస్టల్, గ్రనేడ్లు, తూటాలు లభించాయి. దీంతో వారిని అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీరు ఉగ్రవాదులకు సాయం చేస్తున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. 
 
మరోవైపు, కేంద్ర ప్రభుత్వం యుద్ధ అప్రమత్తతకు పిలుపునిచ్చిన నేపథ్యంలో యుద్ధ సన్నద్ధతపై కేంద్రం హోం శాఖ మంగళవారం కీలక భేటీని నిర్వహించనుంది. బుధవారం అన్ని రాష్ట్రాల్లో సివిల్ మాక్ డ్రిల్స్ చేయాలని కేంద్రం సోమవారం ఆదేశించిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments