Webdunia - Bharat's app for daily news and videos

Install App

సజ్జల రామకృష్ణారెడ్డి భూదందా నిజమే.. నిగ్గు తేల్చిన నిజ నిర్ధారణ కమిటీ

ఠాగూర్
మంగళవారం, 6 మే 2025 (11:44 IST)
గత వైకాపా ప్రభుత్వంలో సకల శాఖామంత్రిగా గుర్తింపు పొందిన ఆ పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి భూకబ్జాలకు పాల్పడినట్టు ప్రభుత్వం నియమించిన నిజ నిర్ధారణ కమిటీ తేల్చింది. వైఎస్ఆర్ జిల్లా సీకే దిన్నెలో సజ్జల కుటుంబం భూ ఆక్రమణలకు పాల్పడినట్టు తేలింది. మొత్తం 63.72 ఎకరాల కబ్జా చేసినట్టు విచారణ కమిటి నిర్ధారించింది. ఆక్రమించుకున్న భూముల్లో 52.40 ఎకరాల అటవీ భూమి, పాయవంక రిజర్వాయర్ భూమి ఉన్నాయని, ఆక్రమి భూముల్లో పక్కా నిర్మాణాలు, ప్రభుత్వ రాయితీలను ఉపయోగించుకున్నారని, భూమి స్వాధీనానికి, కఠిన చర్యలు తీసుకునేలా కమిటి సిఫారసు చేసింది. 
 
సజ్జల కుటుంబం ఆక్రమించుకున్న భూమిలో సింహభాగం అటవీ శాఖకే చెందినదిగా గుర్తించింది. సీకే దిన్నె గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 1629లో ఏకంగా 52.40 ఎకరాల అటవీ భూమిని ఎనిమిది వేర్వేరు ప్రాంతాల్లో ఆక్రమించుకున్నట్టు గుర్తించింది. దీంతో పాటు గతంలో పాయవంక రిజర్వాయర్ నిర్మాణం కోసం ప్రభుత్వం సేకరించిన 8.05 ఎకరాల భూమి, మరికొంత అసైన్డ్ భూమి కూడా ఈ ఆక్రమణలో ఉన్నట్టు తేలింది. ఈ భూములు చుట్టూ కంచె వేయడమే కాకుండా, ఎటువంటి అనుమతులు లేకుండా ఒక అతిథి గృహం, నాలుగు గదులు నిర్మించారని కమిటీ తన నివేదికలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments