Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాభర్తల గొడవ.. భర్తను చంపి ఇంటి వెనక పాతి పెట్టింది..

సెల్వి
మంగళవారం, 4 మార్చి 2025 (12:23 IST)
చిన్న చిన్న విషయాలకే గొడవలు పడి ఆగ్రహావేశాలకు గురై ప్రాణాలు తీసేసుకోవడం.. దాడులు చేసుకోవడం, హత్యలు చేయడం ప్రస్తుతం భార్యాభర్తల మధ్య కామన్ అయిపోయింది. తాజాగా భర్తను చంపి మృతదేహాన్ని ఇంటి వెనుక భాగంలో పూడ్చిపెట్టిందనే ఆరోపణలతో ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. జైపూర్, జాజ్‌పూర్ జిల్లాలోని దుబిఖల్ గ్రామంలో దుమారి ముండా (30)ను పోలీసులు నిందితురాలిగా గుర్తించారు. భర్తను చంపిన తర్వాత సుకిందా పోలీస్ స్టేషన్‌లో దుమారి లొంగిపోయింది. ఇంకా తాను చేసిన నేరాన్ని అంగీకరించింది. 
 
దుమారి బాలాసోర్ జిల్లాకు చెందిన బాబులి ముండా (36)ను దాదాపు ఏడు సంవత్సరాల క్రితం వివాహం చేసుకుంది. ఆ జంట దుబిఖల్‌లోని దుమారి తల్లిదండ్రుల ఇంట్లో ఉంటున్నారు. అయితే, చిన్న చిన్న విషయాలకే నిరంతరం గొడవలు జరుగుతుండడంతో వారి సంబంధం దెబ్బతింది. గురువారం సాయంత్రం, దుమారి తల్లిదండ్రులు మార్కెట్‌కు వెళ్లగా, ఆ జంట ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. 
 
ఆ సమయంలో భార్యాభర్తల మధ్య మాటల వివాదం చెలరేగి, ఆ తర్వాత తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. బాబులి దుమారిపై దాడి చేశాడని ఆరోపించారు. దీంతో కోపంతో, దుమారి అతనిపై కర్రతో దాడి చేసి ప్రతీకారం తీర్చుకుంది. అయితే దుమారి దాడితో బాబులి మరణించాడు. దీంతో షాకైన దుమారి భర్త మృతదేహాన్ని వారి ఇంటి వెనుక భాగంలో పాతిపెట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments