Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్‌లో పెట్రేగిపోయిన ఉగ్రవాదులు.. కశ్మీర్ పండిట్‌పై కాల్పులు

Webdunia
మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (14:12 IST)
జమ్మూకాశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. 24 గంటల వ్యవధిలో వరుసగా 4 ఉగ్రదాడులకు పాల్పడ్డారు. తాజాగా చోటుచేసుకున్న ఘటనలో ఉగ్రవాదులు ఓ కశ్మీరీ పండిట్‌పై కాల్పులు జరపగా, అంతకు ముందు ఘటనల్లో సీఆర్పీఎఫ్ జవాన్లు, స్థానికేతర కూలీలు, సాధారణ పౌరులపై తూటాలు పేల్చారు.  
 
ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు 24 గంటల వ్యవధిలో నాలుగు చోట్ల దాడులు జరిపారు. పుల్వామా తర్వాత రెండో ఘటన శ్రీనగర్‌లో చోటుచేసుకుంది. శ్రీన‌గ‌ర్‌ ఉగ్రదాడి ఘ‌ట‌న‌లో ఓ సీఆర్పీఎఫ్ జ‌వాను మృతిచెందాడు. మ‌రో జ‌వాను గాయ‌ప‌డ్డాడు. భ‌ద్ర‌తా ద‌ళాల చెక్ పాయింట్ వ‌ద్ద ఈ ఘటన జరిగింది. 
 
తాజాగా.. 24 గంటల వ్యవధిలో నాలుగో ఉగ్రదాడి ఘటన షోపియాన్ జిల్లాలో చోటుచేసుకుంది. షోపియాన్ జిల్లా ఛోటోగామ్‌ ప్రాంతంలో దుకాణం నిర్వహించే కశ్మీరీ పండింట్ వ్యక్తిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. 
 
తీవ్రంగా గాయపడిన ఆయనను శ్రీనగర్‌లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ కశ్మీరీ పండిట్‌ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. వరుస ఘటనలపై అధికారులు ప్రకటన విడుదల చేయాల్సిఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభద్రతా భావంలో సల్మాన్ ఖాన్ ... భద్రత రెట్టింపు - బుల్లెట్‌ఫ్రూఫ్ వాహనం దిగుమతి!!

జానీ మాస్టర్ మంచివారు.. నిరపరాధి అని తేలితే ఏంటి పరిస్థితి? అని మాస్టర్

తెలుగు సినిమాల్లో పెరిగిపోయిన తమిళ కంపోజర్ల హవా?

జానీపై కేసు పెట్టడం నేను షాక్ లో ఉన్నాను.. కొరియోగ్రాఫర్ అని మాస్టర్

ఈడీ విచారణకు హాజరైన నటి తమన్నా - అసలు కేసు కథేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments