జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రమూకలు రెచ్చిపోయారు. దీంతో శ్రీనగర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	కాశ్మీర్ శ్రీనగర్‌లోని రైనావారి ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారనే సమారంతో స్థానిక పోలీసులతో కలిసి సీఆర్‌పీఎఫ్ దళాలు గాలింపు చేపట్టాయి. 
	 
	ఈ క్రమంలో ముష్కరులు కాల్పులు జరిపారు. దీంతో ప్రతిగా భద్రతా బలగాల కాల్పులు జరిగింది. దీంతో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. వారిని లష్కరే తొయిబాకు చెందిన స్థానిక ఉగ్రవాదులుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.