Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్వారంటైన్‌లోని మహిళపై గ్యాంగ్ రేప్.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 28 ఏప్రియల్ 2020 (15:16 IST)
లాక్‌డౌన్ సమయంలోనూ కామాంధులు రెచ్చిపోతున్నారు. సొంతూర్లకు వెళ్లేందుకు బస్సులు లేక క్వారంటైన్‌లో ఉన్న మహిళను సైతం కామాంధులు వదిలిపెట్టలేదు. దీనికి నిదర్శనమే క్వారంటైన్‌లో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఇది రాజస్థాన్ రాష్ట్రంలోని సవాయి మాధోపూర్ బటోడా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జైపూర్‌కు చెందిన ఓ మహిళ లాక్‌డౌన్ కారణంగా అక్కడే ఉండాల్సి వచ్చింది. రోజులు గడుస్తున్నా లాక్‌డౌన్‌ను ఎత్తేయకపోవడంతో... కాలినడకన ఆమె సొంతూరుకు బయల్దేరింది.
 
అయితే, గురువారం రాత్రికి ఆమె మాధోపూ‌ర్‌కు చేరుకోగా... స్థానికులు ఆమెను అడ్డుకున్నారు. బటోడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు తరలించారు. దీన్ని అదనుగా తీసుకున్న ముగ్గురు వ్యక్తులు అర్థరాత్రి సమయంలో పాఠశాలకు చేరుకుని ఆమెపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. 
 
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై స్థానిక మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆ కామాంధులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

ప్రముఖ నటి రజిత కి మాతృవియోగం

అగ్రనటులతో టీవీ షోలో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారా?

హరిహర వీరమల్లు విడుదలకు సిధ్ధమవుతోంది - డబ్బింగ్ షురూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం