Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరుణాచల్ ప్రదేశ్‌లో కుప్పకూలిన హెలికాఫ్టర్ - ఇద్దరు మృతి

Webdunia
గురువారం, 16 మార్చి 2023 (17:30 IST)
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో విషాదకర ఘటన ఒకటి చోటు చేసుకుంది. భారత సైన్యానికి చెందిన చెందిన ఓ హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు మృతి చెందినట్టు భావిస్తున్నారు. రాష్ట్రంలోని మండలా పర్వత ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. రోజువారీ విధుల్లో భాగంగా ఇక్కడి సెంగే గ్రామం నుంచి మిసామారీకి వెళ్తుండగా.. మార్గమధ్యలో ఈ ప్రమాదం జరిగినట్లు సైన్యం వెల్లడించింది. 
 
ఈ ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో ఇద్దరు పైలట్లు(లెఫ్టినెంట్ కర్నల్, మేజర్) ఉన్నారని తెలిపింది. ఇద్దరూ గల్లంతయ్యారని, వారి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పేర్కొంది. అయితే, వీరిద్దరూ మృతి చెందివుంటారని భావిస్తున్నారు. 
 
ఈ ఘటనపై ఆర్మీ అధికారులు స్పందిస్తూ, "అరుణాచల్‌లోని బోమ్‌డిలా సమీపంలో గురువారం ఉదయం 9.15 గంటలకు ఆర్మీ చెందిన చీతా హెలికాప్టర్‌కు ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోలర్‌‌తో సంబంధాలు తెగిపోయాయి అని సైన్యం తెలిపింది. 
 
బోమ్‌డిలాకు పశ్చిమాన ఉన్న మండలా ప్రాంతంలో ఇది కూలిపోయినట్లు వెల్లడించింది. మరోవైపు.. స్థానికంగా వాతావరణం పొగమంచుతో కూడుకునివుండంతో 5 మీటర్ల పరిధి వరకే కనిపిస్తోందని స్థానిక పోలీసులు తెలిపారు. సహాయక చర్యలు ప్రారంభించామని, హెలికాప్టర్‌లోని ఇద్దరు పైలట్ల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు చెప్పారు.

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments