Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా రికవరీ రేటులో వృద్ధి.. మరణాల్లో తగ్గుదల : ఆరోగ్య శాఖ

Webdunia
సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (07:25 IST)
ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ దెబ్బకు అనేక అగ్రరాజ్యాలు తల్లడిల్లిపోయాయి. అయితే, ఈ వైరస్‌ మన దేశంలో విస్తృతంగా వ్యాపించకుండా కేంద్ర ఆరోగ్యం శాఖ పటిష్టమైన చర్యలు తీసుకుంది. ఫలితంగా మన దేశంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసు సంఖ్య ఇతర దేశాలతో పోల్చితే తక్కువనే చెప్పొచ్చు. ఇదే విషయంపై ఆరోగ్య శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. 
 
ఇప్పటివరకూ దేశంలో నమోదైన కరోనా కేసుల్లో 97.31శాతం మంది కోలుకున్నారని తెలిపింది. ఇంత రికవరీ రేటు సాధించిన దేశాలు ప్రపంచంలో అతి కొద్దిగా మాత్రమే ఉన్నాయని ప్రభుత్వం అంటోంది. గతేడాది అక్టోబరు 1 నుంచి దేశంలో కరోనా మరణాల సంఖ్య తగ్గుతూనే వచ్చిందని తెలిపింది.
 
ఆదివారం నాటికి ఇది కేవలం 1.43 శాతమే ఉందని పేర్కొంది. కరోనా మరణాల రేటు అత్యంత తక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటని వివరించింది. ఈ మహమ్మారి ధాటికి అగ్రరాజ్యం అమెరికా కూడా అల్లాడిపోయిన సంగతి తెలిసిందే. యూఎస్‌లో సుమారు 5 లక్షల మంది కరోనాకు బలయ్యారు. అమెరికాతో పోల్చుకుంటే మన దేశంలో కరోనా మరణాలు సగానికంటే తక్కువ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments