Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా మహమ్మారికి 40 లక్షల మంది మృతి?

Webdunia
ఆదివారం, 17 ఏప్రియల్ 2022 (13:32 IST)
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి ధాటికి ఏకంగా 40 లక్షల మంది చనిపోయినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. దీన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. కరోనా మరణాలను లెక్కించే విధానాన్ని తప్పుబట్టింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటన విడుదల చేసింది. 
 
తక్కువ జనాభా ఉన్న దేశాలకు అనుసరించిన విధానాన్నే.. భౌగోళికంగా, జనాభా పరంగా పెద్ద దేశమైన భారత్ విషయంలోనూ పాటించడం సరికాదని వ్యాఖ్యానించింది. "అంతర్జాతీయంగా కరోనా మరణాలను బహిర్గతం చేసే విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రయత్నాలను భారత్ అడ్డుకుంటోంది" అంటూ న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. 
 
దీనిపై కేంద్రం వైద్య ఆరోగ్య శాఖ ధీటుగా స్పందించింది. ప్రపంచవ్యాప్తంగా దేశాలు అధికారికంగా ప్రకటించిన గణాంకాలతో పోలిస్తే కరోనా మరణాలు 1.5 కోట్లు అధికంగా ఉంటాయని డబ్ల్యూహెచ్ వో అంచనా. దేశాలన్నీ ప్రకటించిన మరణాల కంటే ఇది రెట్టింపు. భారతదేశంలో మరణాలు కనీసం 40 లక్షలుగా ఉంటాయని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. 
 
అయితే, ప్రపచం ఆరోగ్య సంస్థ ప్రకటించిన మరణాల సంఖ్యపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు. కానీ, మరణాల లెక్కింపునకు అనుసరించిన విధానాన్ని మాత్రం భారత్ తప్పుబడుతుంది. 
 
చైనా, బంగ్లాదేశ్, ఇరాన్ సిరియా సైతం మరణాల లెక్కింపునకు అనుసరించిన విధానాన్ని ప్రశ్నించాయి. ఏవో కొద్ది శాంపిల్ సైజు వివరాలతో మరణాలను అంచనా కట్డడం ట్యునీషియా వంటి చిన్న దేశాలకు చెల్లుతుందేమో కానీ, 130 కోట్ల మంది ఉన్న భారత్ వంటి పెద్ద దేశాలకు కాదు. భారత్ నమూనా ఖచ్చితత్వంతో కూడుకున్నది అని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments