Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైదరాబాద్‌‌కు చెందిన సిగాచీని సత్కరించిన భారత ప్రభుత్వ ఎంఎస్‌ఎంఈ శాఖ సహాయమంత్రి శ్రీ భానుప్రతాప్‌ సింగ్‌

Bhanupratap singh
, శనివారం, 16 ఏప్రియల్ 2022 (18:17 IST)
భారత ప్రభుత్వ ఎంఎస్‌ఎంఈ మంత్రివర్యులు (సహాయ) శ్రీ భాను ప్రతాప్‌సింగ్‌ వర్మ చేతుల మీదుగా సిగాచీ ఇండస్ట్రీయల్‌ లిమిటెడ్‌ ఇటీవల 100 ఎస్‌ఎంఈ అవార్డు 2022ను అందుకుంది. ఇటీవల ముగిసిన 9వ ఎడిషన్‌ ఇండియా ఎస్‌ఎంఈ అవార్డులు 2022వద్ద దీనిని అందజేశారు. ప్రపంచ శ్రేణి ఉత్పత్తులు నిర్మించడంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు అసాధారణ సేవలను అందించినందుకుగానూ ఈ అవార్డును అందజేశారు.

 
సిగాచీ ఎండీ అండ్‌ సీఈఓ అమిత్‌ రాజ్‌ సిన్హా మాట్లాడుతూ, ‘‘అంతర్జాతీయ స్థాయిలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న సిగాచీ ఇండస్ట్రీస్‌కు లభించిన గుర్తింపు పట్ల సంతోషంగా ఉన్నాము. ఎంఎస్‌ఎంఈలకు ఈ సంవత్సరం బడ్జెట్‌ కేటాయింపులు రెట్టింపు కావడంతో పాటుగా 15,700 కోట్ల రూపాయలకు చేరాయి.

 
ఎస్‌ఎంఈలు భారతీయ వృద్థి కథలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారు మరియు 40%కు పైగా ఉద్యోగులు ఈ రంగంలో ఉన్నారు. ఓ సంస్ధగా మేము ఎప్పుడూ మెరుగైన పనితీరుతో శ్రేష్టతను అందిస్తున్నాము. భారతదేశపు వృద్థి కథకు మరింతగా జోడించగలమని ఆశిస్తున్నాము. మా కష్టాన్ని గుర్తించిన ఇండియా ఎస్‌ఎంఈ ఫోరమ్‌కు ధన్యవాదములు తెలుపుతున్నాము’’ అని అన్నారు.

 
ఇండియా ఎస్‌ఎంఈ ఫోరమ్‌ అధ్యక్షులు శ్రీ వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ, ‘‘భారతదేశంలో దాదాపు 65 మిలియన్‌ ఎస్‌ఎంఈ కంపెనీలు దాదాపు 6వేల ఉత్పత్తులు అందిస్తున్నాయి. ఈ ఎస్‌ఎంఈలు భారతీయ ఆర్ధిక వ్యవస్థకు తోడ్పాటునందిస్తుంది. గణాంకాలు వెల్లడించే దాని ప్రకారం ఎస్‌ఎంఈ రంగం తయారీ జీడీపీకి 6.11% తోడ్పాటునందించడంతో పాటుగా సేవారంగపు జీడీపీకి 25.63% తోడ్పాటును, బ్యాంక్‌ లెండింగ్‌కు 16%, ఎగుమతులకు 40%, తయారీ ఔట్‌పుట్‌కు 45% అందిస్తుంది. ఇప్పుడు 37134 ఎస్‌ఎంలలో సిగాచీ ఇండస్ట్రీస్‌ ఇప్పుడు టాప్‌ 100 ఎస్‌ఎంఈ సంస్థలలో ఒకటిగా నిలిచింది’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆడి బ్రాండ్ అంబాసిడర్‌గా మహేష్ బాబు