Publish Date: Fri, 15 Apr 2022 (16:10 IST)
Updated Date: Fri, 15 Apr 2022 (16:14 IST)
హైదరాబాద్ నగరంలోని మద్యం బాబులకు ఇది నిజంగానే దుర్వార్త. వారాంతపు రోజైన శనివారం జంట నగరాల్లో మద్యం షాపులను మూసివేయనున్నారు. దీనికి కారణం హనుమాన్ శోభాయాత్ర.
ప్రతి యేడాది తరహాలోనే ఈ యేడాది కూడా హనుమాన్ శోభాయాత్రకు హైదరాబాద్ నగరం ముస్తాబవుతుంది. శనివారం హనుమాన్ శోభాయాత్రను ఘనంగా నిర్వహించనున్నారు. గౌలిగూడ రామ్ మందిర్ నుంచి తాడ్ బంద్ హనుమాన్ ఆలయం వరకు ఈ శోభాయాత్ర సాగనుంది.
ఈ యాత్రను పురస్కరించుకుని నగరంలోని పలు ఆంక్షలు విధించారు. 24 గంటల పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. శనివారం ఉదయం 6 గంటలకు నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు బార్లు, వైన్ షాపులు, కల్లు దుకాణాలు విధిగా మూసివేయాలని సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రా ఆదేశించారు.